A నుంచి Z వ‌ర‌కు అన్నీ సాధించాం

మంచిర్యాల : తాము A నుంచి Z వ‌ర‌కు అన్నీ ప‌థ‌కాలు సాధించామ‌ని తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘ నేత‌లు ప్ర‌చారం చేస్తున్నారు. కోల్ ఇండియ‌లో లేని ప‌థ‌కాలు సైతం సాధించామ‌ని స్ప‌ష్టం చేస్తున్నారు. ఈ మేర‌కు ఇంగ్లీషు అక్ష‌ర‌మాల‌లో తాము సాధించిన ప‌థ‌కాలు ప్ర‌చారం చేస్తున్నారు. మంద‌మ‌ర్రి డివిజ‌న్‌ రామ‌కృష్ణాపూర్ సీఎస్‌పీ పిట్ సెక్ర‌ట‌రీ జ‌క్క‌వేని శ్రీ‌నివాస్ ఆంగ్ల అక్ష‌రమాల‌లో ఏ నుంచి జ‌డ్ వ‌ర‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ హ‌యాంలో తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘం సాధించిన ప‌థ‌కాల‌ను రూపొందించి ప్ర‌చారం చేస్తున్నారు.

A). ఏసీ… ఉచిత విద్యుత్‌తో కార్మికుల‌కు ఏసీ

B). బ‌దిలీ వ‌ర్క‌ర్లు 2,718 మందికి ఒకేసారి జ‌న‌ర‌ల్ మ‌జ్దూర్లుగా ప్ర‌మోష‌న్‌

C). క‌రంటు చార్జీలు ఫ్రీ

D). డిపెండెంట్ ఉద్యోగాలు.. మెడిక‌ల్ ఇన్‌వాలిడేష‌న్ ద్వారా డిపెండెంట్ ఉద్యాగ‌ల క‌ల్ప‌న‌. 87 మెడికల్ బోర్డుల ద్వారా దాదాపు 10,000 మంది కార్మికుల బిడ్డలకు సింగరేణిలో పని వచ్చిందంటే కారణం మన ముఖ్యమంత్రి కేసీఆర్‌.

E). ఎక్స్‌ట్రా.. అద‌నంగా రెండు పీహెచ్ డీలు

F). ఫ్రీ ఎడ్యుకేషన్ ఐ.ఐ.టి. & ఐ.ఐ.ఎం. విదేశాల్లో చదివే విద్యార్థుల‌కు ఉచిత విద్య‌..

G). మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వ‌డం.. ఇంతకముందు కార్మికుడు చనిపోతే ఎక్స్ గ్రేషియా 5 లక్షలు
కానీ TBGKS గుర్తింపు సంఘంగా గెలిచిన త‌ర్వాత గ‌నిలో ప్ర‌మాదం సంభ‌విస్తే 20 లక్షలు,
సహజమరణానికి 15 లక్షలు మ్యాచింగ్ గ్రాంట్ రూపంలో ఇస్తున్నారు.

H). 10 లక్షల వ‌ర‌కు గృహనిర్మాణ వడ్డీ రద్దు

I ). క్యాంటీన్ల ఆధునీక‌ర‌ణ‌, ఆర్వో ప్లాంట్ల ఏర్పాటు

J). జూనియ‌ర్ అసిస్టెంట్, టెక్నీషియ‌న్లు, మేనేజ్‌మెంట్ ట్రెయిన్ పోస్టుల భ‌ర్తీ

K). కేవీ ప‌వ‌ర్ స్టేష‌న్లు, ఎస్‌టీపీపీ, అన్ని డివిజ‌న్ల‌లో సోలార్ ప‌వ‌ర్ ప్లాంట్లు

L). ఉద్యోగం వద్దనుకుంటే గ‌తంలో ఇచ్చే రూ. 12.50 ల‌క్ష‌ల‌ను 25 లక్షలకు పెంపు

M). నెల‌వారీ డిపెండెంట్ ఉద్యోగాల‌ను నెల‌కు 25 నుంచి 270కు పెంచారు. ఇందులో ఒకేసారి వ‌న్ టైం సెటిల్‌మెంట్ కింద 3500 ఉద్యోగాలు ఇచ్చింది తెలంగాణ ప్ర‌భుత్వం

N). కొత్త‌గా ఉద్యోగుల వ‌య‌సు 61 ఏండ్ల‌కు పెంపు

O). O.D. లు, P.M.E.ల‌కు ఉచిత మ‌స్ట‌ర్

P). లాభాల్లో వాటా 16% నుంచి 28% శాతం పెంపు

Q). N.O.C. క్లియరెన్స్

R). రిటైర్ అయిన కార్మికుల‌కు సాద‌రంగా వీడోల్కు ప‌లికేందుకు రూ. 900 నుంచి రూ. 3500 పెంపు

S). సూప‌ర్ స్పెషాలిటీ వైద్యం కార్మికుల‌తో పాటు వారి త‌ల్లిదండ్రుల‌కు కూడా

T). తెలంగాణ ఇంక్రిమెంట్ ప్ర‌భుత్వ ఉద్యోగుల‌తో స‌హా సింగ‌రేణి కార్మికుల‌కు

U). యూనిఫాం.. అండ‌ర్ గ్రౌండ్ కార్మికుల‌తో స‌హా

V). దాదాపు అన్ని గ‌నుల్లో మాన్ రైడింగ్ సిస్టం అమ‌లు

W). సకలజనుల సమ్మె కాలానికి వేతనం… ప్రపంచంలో ఎక్కడా ఇలా ఇవ్వలేదు కేవ‌లం సింగ‌రేణిలో త‌ప్ప‌..

X). దిగిపోయిన కార్మికుల‌కు క్లెయిమ్స్‌, సెటిల్‌మెంట్లు వీలైనంత త‌ర్వ‌గా అంద‌చేత‌.

Y). కార్మికుల పిల్ల‌ల‌కు రెండో కాన్పు కూడా ఉచితంగా

Z). జీరో క‌ర‌ప్ష‌న్‌.. సింగ‌రేణిలో అవినీతి ర‌హిత పాల‌న

Get real time updates directly on you device, subscribe now.

You might also like