ఏడో పెళ్లికి రెడీ అయిన నిత్యపెళ్ళికూతురు

అరెస్టు చేసి జైల్లో వేసిన పోలీసులు

A perpetual bride who is ready for her seventh marriage : పెళ్లంటే మూడుముళ్ల బంధం.. ఏడడుగుల అనుబంధం.. కానీ ఆమెకు మాత్రం 21 ముళ్లు.. 49 అడుగులు.. ఒకరు కాదు ఇద్దరు కాదు ఆరుగురిని అప్పటికే పెళ్లి పేరుతో మోసం చేసింది. ఏడో పెళ్లికి సిద్ధమయిన ఆ నిత్యపెళ్లికూతురు ఇప్పుడు జైళ్ళో ఊచలు లెక్కపెడుతోంది. వరుసగా ఆరు పెళ్ళళ్ళు చేసుకుని ఏడో పెళ్ళి చేసుకుంటుండ‌గా దొరికిందా నిత్య పెళ్ళి కూతురు. తమిళనాడులో జరిగిందీ ఘటన. పెళ్ళి చేసుకోవడం …శోభనం తరువాత ఉదయాన్నే మొత్తం దోచుకెళ్ళడం నిత్యపెళ్ళి కూతురు సంధ్యకు తాళిబొట్టుతో పెట్టిన విద్య.

నమక్కల్ జిల్లా పరమతివేలూరు చెందిన సంధ్య ఇప్పటివరకూ ఆరు పెళ్లిళ్లు చేసుకుంది. ఆమె పెళ్ళంటే ఒక ఆట.. చెన్నై, నమక్కల్,మధురై లోని ఆరుమందిని పెళ్ళి చేసుకుని శోభనం తరువాత నగలు, నగదుతో జంప్ అవుతోంది. తాజాగా ధనపాల్ అనే వ్యక్తిని పెళ్ళి చేసుకుంది సంధ్య. మధురైకి చెందిన ధనలక్ష్మీ అనే పెళ్ళళ్ళ బ్రోకర్ కు రెండు లక్షలు ఇచ్చి సంధ్య ను చేసుకున్నాడు ధనపాల్. అంతా బాగానే జరిగింది. మూడు ముళ్ళు పడ్డాయి.. శోభనం రాత్రి ఆమె చేసిన పనికి పెళ్లికొడుకు షాకయ్యాడు. శోభనం తరువాత నగలు,నగదు ,ఇంట్లోని సామాన్లతో జంప్ అయిపోయింది సంధ్య.

ఉదయాన్ని సంధ్య, బ్రోకర్ ధనలక్ష్మి కనిపించపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు ధనపాల్. ఈ లోపు మరో పెళ్ళికి స్కెచ్చేసింది సంధ్య‌… ఈ సమయంలో సంధ్యను అడ్డంగా పట్టుకున్నారు పోలీసులు. రకరకాల గెటప్ లతో, రకరకాల పేర్లతో వరుసగా ఆరు పెళ్ళళ్ళు చేసుకున్న సంధ్యను చూసి అంతా నోరెళ్లబెట్టారు. నమక్కల్ జిల్లాలోని ప్రతి పెళ్లిళ్ళ బ్రోకర్ల వద్ద సంధ్య ఫోటోలు వున్నాయంటే ఆమె ఎంత మోసగత్తో అర్థం చేసుకోవచ్చు. సంధ్య సహా బ్రోకర్ ధనలక్ష్మి, సంధ్య మామను అరెస్టు చేశారు పోలీసులు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like