ఆ ఎమ్మెల్యేకు కేసీఆర్ క్లాస్..

హైద‌రాబాద్ లోని టీఆర్ఎస్ఎల్పీ కార్యాల‌యంలో టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న ఆ పార్టీ విస్తృత స్థాయి సమావేశం సోమవారం నిర్వ‌హించారు. ఇందులో టీఆర్ఎస్ నాయ‌కులకు కేసీఆర్ దిశానిర్ధేశం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం అవ‌లంభిస్తున్న విధానాలను, ఆ పార్టీ నాయకులు చేసే ఆరోప‌ణ‌లను తిప్పి కొట్టాల‌ని సూచించారు.

ఈ స‌మావేశం అనంత‌రం మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్‎ ను సీఎం కేసీరా్ త‌న ఛాంబ‌ర్ కు పిలిపించుకున్న‌ట్టు స‌మాచారం. హెలీ పండ‌గ రోజు మందేస్తూ, చిందేసిన విష‌యంపై కేసీఆర్ ఆయ‌న‌పై సీరియ‌స్ అయ్యారు. ఎమ్మెల్యేపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ క్లాస్ తీసుకున్నట్టు తెలుస్తోంది. హోలీ పండ‌గ అంద‌రూ చేసుకుంటార‌ని, కానీ ఇలా బ‌హిరంగంగా మ‌ద్యం పోస్తూ, డ్యాన్స్ లు చేయ‌డం ఏంట‌ని ప్ర‌శ్నించారు.

టీఆర్ఎస్ ప‌రువు తీసేలా ఎవ‌రూ ప‌ని చేయ‌కూడ‌ద‌ని అన్నారు. ఇలా చేస్తే ప్ర‌జ‌ల నుంచి తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తాయ‌ని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీలో క్ర‌మ‌శిక్ష‌ణ చాలా ముఖ్య‌మని అన్నారు. ఇప్ప‌టికే చాలా ఫిర్యాదులు వ‌చ్చాయ‌ని అన్నారు. అన్నింటినీ చూస్తూ వ‌దిలేస్తున్నామ‌ని తెలిపారు. అయితే ఇలాంటి ప‌నులు మళ్లీ రిపీట్ కాకుండా చూసుకోవాల‌ని హెచ్చ‌రించారు. మ‌ళ్లీ ఇలాంటి కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డితే టీఆర్ఎస్ నుంచి బ‌హిష్క‌రిస్తామ‌ని హెచ్చ‌రించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like