ఆదిలాబాద్‌లో అశ్లీల నృత్యాలు

అధికార పార్టీ నేత‌ పుట్టిన రోజు వేడుక‌ల్లో చిందులు

ఆదిలాబాద్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాల‌నుకున్న అధికార పార్టీకి ఆ ఒక్క‌టీ త‌క్కువ‌నిపించిదో ఏమో…? అలాంటివి మ‌న వ‌ద్ద ఎందుకు ఉండ‌ద్దొని అనుకున్నారో తెలియ‌దు.. కానీ మొత్తానికి ఓ అధికార పార్టీ నేత పుట్టిన రోజు వేడుక‌ల్లో ఉర్రూత‌లూగించారు..

వివ‌రాల్లోకి వెళితే.. ఆదిలాబాద్ పట్టణంలో ఓ అధికార పార్టీ నేత పుట్టినరోజు వేడుకల్లో చేపట్టిన అశ్లీల నృత్యాల అంశం ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ పుట్టిన రోజు వేడుక జిల్లాలో దుమారం రేపుతోంది. ఈ వేడుకలో మాములుగా ఉండే మందు, విందుతో పాటు చిందులు కూడా వేయించారు. కార్యక్రమంలో టిఆర్ఎస్, వివిధ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా పుట్టినరోజు వేడుకల్లో రికార్డింగ్ డాన్సుల సంస్కృతి ఆదిలాబాద్ జిల్లాకు పాక‌డం చర్చనీయాంశంగా మారింది. ఇదంతా ఒక్కెత్తు కాగా, ఈ వేడుకలకు ఆఫీసర్స్‌ క్లబ్ వేదికగా మారింది. ఈ రికార్డింగ్ డ్యాన్సుల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఆఫీసర్స్ క్లబ్లో రికార్డింగ్ డాన్సులు నిర్వహించిన తీరుపై జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సీరియస్ అయినట్లు సమాచారం.

Get real time updates directly on you device, subscribe now.

You might also like