187 కేంద్రాలు.. 98,880 మంది అభ్యర్థులు

-సింగరేణి జూనియర్‌ అసిస్టెంట్‌ రాత పరీక్షకు అన్ని ఏర్పాట్లు
-ఇప్ప‌టికే హాల్‌ టికెట్ల జారీ
-వెబ్‌ సైట్‌ నుంచి హాల్‌ టికెట్ల డౌన్‌ లోడ్‌ ప్రారంభం
-డైరెక్టర్‌ (పర్సనల్‌, ఆపరేషన్స్‌) ఎస్‌.చంద్రశేఖర్‌ వెల్లడి

All arrangements are complete for Singareni Junior Assistant Exam:సెప్టెంబరు 4న‌ జరగనున్న సింగరేణి జూనియర్‌ అసిస్టెంట్‌ (ఎక్స్‌ టర్నల్‌) రాత పరీక్ష కోసం తెలంగాణలోని 8 జిల్లాల్లోని 187 పరీక్ష కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేసినట్లు డైరెక్టర్‌ (పర్సనల్‌, ఆపరేషన్స్‌) ఎస్‌.చంద్రశేఖర్ వెల్ల‌డించారు.

సింగ‌రేణిలో జూనియ‌ర్ అసిస్టెంట్ల‌కు సంబంధించి 177 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్‌ జారీ చేసిన‌ట్లు తెలిపారు. దీని కోసం 1.02 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారఅన్నారు. అర్హతలున్న 98,880 మంది అభ్యర్థులకు హాల్‌ టికెట్లను జారీ చేసినట్లు వెల్లడించారు. అభ్యర్థులు తమ హాల్‌ టికెట్లను http://tssccl.onlineportal.org.in/SiteContent/Halltickets వెబ్‌ లింక్‌ ను ఓపెన్‌ చేసి డౌన్‌ లోడ్‌ చేసుకోవాలని సూచించారు.

ప‌రీక్ష‌లో నెగెటివ్ మార్కులు కూడా..
అభ్యర్థి అప్లికేషన్‌ నెంబర్‌ లేదా రిజిస్టర్డు మొబైల్‌ నెంబర్‌, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్‌ చేయడం ద్వారా వారికి సంబంధించిన హాల్‌ టికెట్లను డౌన్‌ లోడ్‌ చేసుకోవచ్చన్నారు. సెప్టెంబరు 4వ తేదీన ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్ష ఉంటుందని తెలిపారు. పరీక్షలో నెగటివ్‌ మార్కింగ్‌ కూడా ఉంటుందని, అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలని, అలాగే హాల్‌ టికెట్లో ఇచ్చిన సూచనలను తప్పనిసరిగా పాటించాలన్నారు.

187 పరీక్ష కేంద్రాలు
జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుల కోసం భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చినందున తెలంగాణలోని 8 జిల్లాల్లో 187 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు డైరెక్టర్‌ శ్రీ ఎస్‌.చంద్రశేఖర్‌ తెలిపారు. హైదరాబాద్‌ `1, 2, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, ఆదిలాబాద్‌ జిల్లాలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. పరీక్షల నిర్వహణ పర్యవేక్షణకు ప్రతీ రీజియన్‌కు ఒక్కో చీఫ్‌ కో ఆర్డినేటర్‌ను నియమించామని, ప్రతీ కేంద్రానికి పర్యవేక్షకులు ఉంటారని తెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like