పార్టీ అధ్యక్షుడు, ఇంచార్జీల నియామకం

Manchiryal:క్యాతన్పల్లి మున్సిపాలిటీ బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడిగా అబ్దుల్ అజీజ్, పట్టణ ఇంచార్జ్ గా సీనియర్ నాయకులు గాండ్ల సమ్మయ్యని నియమిస్తూ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా బాల్క సుమన్ మాట్లాడుతు పాలకవర్గ సభ్యులతో పాటు పార్టీ నాయకులందరినీ కలుపుకొని రామకృష్ణాపూర్ మున్సిపాలిటీలో బిఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయాలన్నారు. పార్టీ కార్యక్రమాలతో పాటు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా చొరవ చూపాలన్నారు.

బాధ్యత మరింత పెరిగింది
పట్టణ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్
తనని పట్టణ అధ్యక్షుడిగా నియమించిన ఎమ్మెల్యే బాల్క సుమన్ కి ప్రత్యేక కృతజ్ఞతలు. పార్టీలో కష్టపడ్డ వారికి గుర్తింపు ఉంటుందనడానికి ఇది నిదర్శనం. ఈ పదవితో నాకు మరింత బాధ్యత పెరిగింది. సీనియర్లు, జూనియర్లను అని తేడా లేకుండా ముందుకూ వెళ్తా. కష్టపడి పనిచేస్తున్న ప్రతి కార్యకర్తను కలుపుకొని పార్టీని మరింత బలోపేతం చేస్తా. ఎమ్మెల్యే నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తా.

రుణపడి ఉంటా..
పట్టణ ఇంచార్జ్ గాండ్ల సమ్మయ్య
తనని పట్టణ ఇన్చార్జిగా నియమించిన ఎమ్మెల్యే బాల్క సుమన్ కి, కేసీఆర్ కి ప్రత్యేక కృతజ్ఞతలు. రామకృష్ణాపూర్ లో బిఆర్ఎస్ పార్టీని తిరుగులేని రాజకీయ శక్తిగా మార్చడానికి కృషి చేస్తాను. ఎమ్మెల్యే ఆశీస్సులతో మున్సిపాలిటీ అభివృద్ధితో పాటు రామకృష్ణాపూర్ పట్టణ అస్తిత్వానికి కృషి చేస్తాను. వచ్చే సాధారణ ఎన్నికల్లో రామకృష్ణాపూర్ నుండి అధిక మెజారిటీ వచ్చేలా, మున్సిపల్ ఎన్నికల్లో అన్ని సీట్లు గెలిపించడమే నా ముందున్న లక్ష్యం. ప్రజలకు,పార్టీకి మరింత సేవ చేసేలా తనని ఇన్చార్జిగా నియమించిన ఎమ్మెల్యేకి ఎల్లప్పుడు రుణపడి ఉంటాను.

Get real time updates directly on you device, subscribe now.

You might also like