బీర్లు, బిర్యానీలకు అమ్ముడుపోయేది నీ పార్టీ వాళ్లే..

-తెలంగాణ ఉద్య‌మంలో TRSV క్రియాశీల‌క పాత్ర‌
-అక్ర‌మార్కుల‌తో చేతులు క‌లిసిన నువ్వో దోపిడీ దొంగ‌వు
-ఆ మాట‌లు వెన‌క్కి తీసుకోక‌పోతే తీవ్ర ప‌రిణామాలు
-TRSV జిల్లా అధ్య‌క్షుడు బ‌డిక‌ల శ్రావ‌ణ్‌

మంచిర్యాల : TRSV పోర‌గాళ్లు చిల్లర గాళ్ళు, బీర్లు బిర్యానిల కోసం పనిచేస్తారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించ‌డం ప‌ట్ల టీఆర్ఎస్‌వీ జిల్లా అధ్య‌క్షుడు బడికల శ్రావణ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఓ ఇంట‌ర్వ్యూలో తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం నేత‌ల‌ను కించ‌పరిచేలా మాట్లాడార‌ని అది స‌రికాద‌న్నారు. ఆ స్థాయి నేత చిల్ల‌ర మాటలు మాట్ల‌డం స‌రికాద‌న్నారు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాల‌న్నారు. మలి దశ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం నిరంతరం కోట్లాడిన సంస్థ TRSV అని ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు. నువ్వు ఆంధ్ర నాయకుల బూట్లు నాకుతున్న సమయంలో నీలాంటి తెలంగాణ వ్యతిరేకులను తన్నీ తెలంగాణ కు అనుకూలంగా జై కొట్టించిన సంస్థ TRSV అని స్ప‌ష్టం చేశారు. ఇలాంటి చిల్లర మల్లర రాజకీయాలు మానుకోవాల‌ని డిమాండ్ చేశారు. మాటలు వెనక్కి తీసుకో లేకుంటే గ్రామ గ్రామన తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం కార్యకర్తలు అడ్డుకుంటార‌ని హెచ్చ‌రించారు. బీర్లకు బిర్యానికి అమ్ముడుపోయే చిల్లర గానివి నువ్వు, నీ పార్టీ వారే అని స్ప‌ష్టం చేశారు. అక్రమంగా అవినీతి గా సంపాదించిన వేదవలతో చేతులు కలిపి దోపిడీ చేసే దొంగవు నీవ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌మ‌ లక్ష్యం, త‌మ ఆశయం నాడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అని, నేడు బంగారు తెలంగాణ సాధన అని మ‌రోమారు స్ప‌ష్టం చేశారు. వెంట‌నే TRSV సంస్థకు, కార్యకర్తలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like