బెల్లంపల్లి మున్సిపల్‌ కమిషనర్‌పై కేటీఆర్‌ ఆగ్రహం

ఇలాంటి అభిమానం స‌రికాదు… నేను వీటిని ప్రోత్స‌హించ‌న‌ని మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. బెల్లంప‌ల్లి మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ ను వెంట‌నే స‌స్పెండ్ చేయాల‌ని పురపాలకశాఖ సంచాలకులు సత్యనారాయణకు ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి అభిమానాన్ని ప్రోత్సహించడంలో తానెప్పుడు చివర ఉంటానని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు.

ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే..
మంత్రి కేటీఆర్ సంద‌ర్భంగా ఈ నెల 24న మంత్రి కేటీఆర్‌ జన్మదిన వేడుకలు జ‌రిగాయి. ఈ వేడుక‌ల‌కు హాజరు కాలేదంటూ బెల్లింపల్లి మున్సిపల్ కార్యాలయంలోని ముగ్గురి సిబ్బందికి కమిషనర్‌ నోటీసులు జారీ చేశారు. సీనియర్ అసిస్టెంట్ టి.రాజేశ్వరి, జూనియర్ అసిస్టెంట్ ఎస్.పున్నంచందర్. సిస్టం మేనేజర్ ఎ.మోహన్లకు ఆయన మెమోలు ఇచ్చారు. 24 గంటల్లోగా సంజాయిషీ ఇవ్వాలని, లేక‌పోతే క్రమశిక్షణ చర్యలు ఉంటాయని తెలిపారు.

సీరియ‌స్ అయిన మంత్రి..
ఈ విష‌యంలో ప‌త్రిక‌లు, సోష‌ల్‌మీడియా ద్వారా మంత్రి కేటీఆర్ దృష్టికి వెళ్లింది. అదే స‌మ‌యంలో దీనిపై కాంగ్రెస్ పార్టీ నేత‌లు సైతం నిర‌స‌న‌లు తెలిపారు. ఈ విషయం మంత్రి కేటీఆర్‌ దృష్టి రాగా స్పందించారు. కమిషనర్‌ తీరుపై విచారం వ్యక్తం చేస్తూ.. సస్పెండ్‌ చేయాలని మంత్రి సీడీఎంను ఆదేశించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like