బీజేపీ అధ్యక్షుడు బండి అరెస్ట్

పరిస్థితి ఉద్రిక్తం

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ అరెస్ట్‌ అయ్యారు. ప్రస్తుతం జనగామ జిల్లాలో బీజేపీ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బండి సంజయ్‌ను జనగామలో పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిన్న కవిత ఇంటి దగ్గర బీజేపీ కార్యకర్తలపై దాడికి నిరసనగా దీక్ష చేయాలని బండి సంజయ్‌ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే దీక్షకు కుర్చుకున్నారు. అయితే సమాచారం తెలుసుకున్న పోలీసులు దీక్షను భగ్నం చేసి, బండి సంజయ్‌ని అరెస్ట్‌ చేశారు. బండి సంజయ్ ను స్టేషన్ ఘన్ పూర్ సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. బండి అరెస్ట్ నేపథ్యంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

Get real time updates directly on you device, subscribe now.

You might also like