క్రీడాకారుల‌కు అండ‌గా ఉంటాం

సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క

CLP leader Bhatti Vikramarka said that he will support the sportsmen: క్రీడాకారుల‌కు అండ‌గా ఉంటామ‌ని సీఎల్ఎపీ నేత బ‌ట్టి విక్ర‌మార్క అన్నారు. శ‌నివారం రాజీవ్ గాంధీ మెమోరియల్ జూనియర్ క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు ట్రోఫీ అందించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ఏ అవసరం ఉన్నా పార్టీ తరపున అండగా ఉంటామ‌ని స్ప‌ష్టం చేశారు. ఈ సంద‌ర్భంగా విజేత‌ల‌కు అభినంద‌న‌లు తెలిపారు.

ఖమ్మం జిల్లా NSUI కమిటీ ఆధ్వర్యంలో రాజీవ్ మెమోరియల్ జూనియర్ క్రికెట్ టోర్నమెంట్ లో నిర్వ‌హించారు. ఇందులో తిరుమలాయపాలేం తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ జూనియర్ కాలేజ్ (TTWJC) విజేతగా నిలిచింది, SBIT ITI ద్వితీయ‌స్థానంలో నిలిచిన‌ట్లు జిల్లా NSUI అధ్యక్షులు వెగినాటి ఉదయ్ కుమార్ తెలిపారు. సోనియాగాంధీ జన్మదినోత్సవ సందర్భంగా ఈ నెల 5 నుంచి టోర్నీ నిర్వ‌హించిన‌ట్లు తెలిపారు. మొత్తం టోర్నీలో 28 టీమ్ లు పాల్గొన్నాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్, ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు వీరభద్రం, ప‌ట్ట‌ణ‌ కాంగ్రెస్ అధ్యక్షుడు జావిద్, NSUI ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడు మోహన్, జిల్లా కార్యదర్శి నవీన్, తిరుమలయపాలేం మండల యూత్ కాంగ్రెస్ నాయకులు బత్తుల రమేష్, తాళ్ల‌పల్లి సురేష్ పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like