దురుద్దేశంతో బాలిక‌ల‌ను తాక‌డం నేర‌మే..

లైంగిక ఉద్దేశంతో బాధితురాలి ఛాతీని లేదా నిర్థిష్ట భాగాల‌ను తాకితే.. అది లైంగిక వేధింపుల కింద‌కు వ‌స్తుంద‌ని కోల్‌క‌తా హైకోర్టు వ్యాఖ్యానించింది. బాధితురాలి శరీరంలో ఛాతి భాగంగా అభివృద్ధి చెందిందా..? లేదా..? అనేది అప్రస్తుతమని, నిందితుడు దురుద్దేశంతో తాకితే లైంగిక వేధింపులుగా ప‌రిగ‌ణించాల‌ని స్ప‌ష్టం చేసింది. 2017లో న‌మోదైన కేసుకు సంబంధించి కోర్టు ఈ ఉత్త‌ర్వులు జారీ చేసింది. పోక్సో చట్టంలోని సెక్షన్ 8, సెక్షన్ 448ల ప్రకారం నిందితుడు దోషి అని నిర్థారించింది.

ఇంట్లో ఒంట‌రిగా ఉన్న స‌మ‌యంలో రోహిత్ పాల్ అనే వ్య‌క్తి ఇంట్లోకి ప్రవేశించి ఓ బాలిక(13)ను లైంగికంగా వేధించాడు. ఇంట్లో ఆడుకుంటున్న బాలిక‌ను దగ్గరకు లాక్కున్నాడు. ఆమె ఛాతీతో పాటు శరీరంలోని ఇతర భాగాలను తాకుతూ, ఆమె ముఖంపై ముద్దులుపెట్టాడు. దీంతో ఆ బాలిక గ‌ట్టిగా అర‌వ‌డంతో ఆ నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. అనంత‌రం బాలిక తల్లి ఫిర్యాదు చేయడంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడుపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పోక్సో చట్టంలోని సెక్షన్ 8, సెక్షన్ 448ల ప్రకారం నిందితుడిని దోషిగా తేల్చి శిక్ష ఖరారు చేసింది.

అయితే.. ఆ నిందితుడు ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టులో సవాల్ చేశాడు. విచారణ సందర్భంగా, బాధితురాలి ఛాతీ భాగం తాక‌డం అనే ప్రశ్న అస్సలు తలెత్తదని నిందితులు చెప్పారు. ఎందుకంటే బాలిక ఛాతీ భాగం అభివృద్ధి చెందలేదని హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ జరిపిన కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తి బిబెక్ చౌదరి నిందితుడి వాదనను తోసిపుచ్చారు.

జస్టిస్ బిబేక్ చౌధురి మాట్లాడుతూ, “13 ఏళ్ల బాలిక ఛాతి భాగం అభివృద్ధి చెందిందా..? లేదా..? అనేది అప్రస్తుతం, పూర్తిగా అసంబద్ధం. పలు వైద్య కారణాల వల్ల శరీరంలో ఛాతి భాగం అభివృద్ధి చెందకపోయుండొచ్చని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. అదేవిధంగా వ్యక్తి లైంగిక ఉద్దేశానికి ప్రత్యక్ష సాక్ష్యం ఉండదని కోర్టు వెల్లడించింది. అలాగే “నిందితుడు ఆమె శరీరంలోని వివిధ భాగాలను తాకాడు. ముద్దుపెట్టుకున్నాడు. ఎటువంటి సంబంధం లేనివాడు ఇంట్లో ఎవరూ లేనప్పుడు బాలికను ఎందుకు ముద్దు పెట్టుకోవాలి. బాధితులతో నిర్ధిష్ట పరిచయం, పరిసర పరిస్థితులను బట్టి నిందితుడి లైంగిక దృష్టిని అంచనా వేయవచ్చు” అని కోర్టు పేర్కొంది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like