జీవో 76 గ‌డువు పెంపు

ముఖ్య‌మంత్రికి విప్ బాల్క సుమ‌న్ కృత‌జ్ఞ‌త‌లు

సింగ‌రేణి ఏరియాల్లో భూముల క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ కోసం తీసుకువ‌చ్చిన జీవో76 గ‌డువు ప్ర‌భుత్వం రెండు నెల‌ల పాటు పొడిగించింది. ఈ మేర‌కు ఉత్త‌ర్వులు జారీ అయ్యాయి. సింగ‌రేణి ఏరియాల్లో ఉన్న భూముల్లో కార్మికులు, రిటైర్ అయిన వారు, ఇత‌ర ప్ర‌జ‌లు సైతం ద‌శాబ్దాలుగా ఇండ్లు క‌ట్టుకుని నివాసం ఉంటున్నారు. అయితే, మొద‌టి నుంచి ఇక్క‌డ వీళ్ల‌కు ఆ భూమిపై హ‌క్కు లేకుండా పోయింది. ఇండ్లు క‌ట్టుకున్నందుకు అనుమ‌తులు ఇవ్వ‌లేని ప‌రిస్థితి. ఇక బ్యాంకులోన్లు స‌రేస‌రి. వాటి గురించి అడిగే నాథుడే లేకుండా పోయాడు. ప్ర‌భుత్వ విప్ బాల్క సుమ‌న్ ప్ర‌భుత్వం దృష్టికి తీసుకువెళ్ల‌డంతో జీవో76 జారీ చేశారు. ఈ మేర‌కు సింగ‌రేణి ఏరియాల్లో ఉన్న వారికి ప‌ట్టాలు ఇచ్చేందుకు స‌ర్వే చేశారు. చాలా చోట్ల ప‌ట్టాలు సైతం అందించారు.

కొన్ని కార‌ణాల వ‌ల్ల ప‌లు ప్రాంతాలు స‌ర్వే చేయ‌లేదు. జీవో 76 గ‌డువు సైతం ద‌గ్గ‌ర‌ప‌డింది. ఈ నేప‌థ్యంలో విప్ బాల్క సుమ‌న్ విష‌యాన్ని మ‌రోమారు ప్ర‌భుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. కొద్ది రోజుల కింద‌ట ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేష్‌కుమార్ ను కల‌సి విష‌యాన్ని వివ‌రించారు. ఈ నేప‌థ్యంలో జీవో 76 గడువు రెండు నెలలు పొడిగించింది. తేదీ: 13.06.22 నుండి 12.08.22 తేదీ వరకు రెండు నెలల గడువు పొడగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

జీవో 76 గడువు పెంపుతో రామకృష్ణాపూర్లో గతంలో చేసిన సర్వేలో మిస్ అయిన భగత్ సింగ్ నగర్,రాజీవ్ నగర్,శివాజీ నగర్,జవహర్ నగర్,శ్రీనివాస్ నగర్,మల్లికార్జున నగర్,గంగా కాలనీ, విద్యానగర్, RK4 గడ్డ, పోస్ట్ఆఫీస్ లైన్కు చెందిన భూముల క్రమబద్ధీకరణకు వెసులుబాటు కలుగుతుంది. పట్టణ ప్రజలు సదవకాశాన్ని వినియోగించుకోగలరని విజ్ఞప్తి చేశారు. కోరిన వెంటనే జీవో 76 రెండు నెలలు పొడిగించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి విప్ బాల్క సుమ‌న్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like