ప్రేంసాగ‌ర్ రావు గెలిస్తే గుండారాజ్యం

-అరవింద‌రెడ్డిని కొనాలంటే ద‌మ్ముండాలి
-బిచ్చగాళ్ల ద‌గ్గ‌రే డ‌బ్బులు తీసుకునే వ్య‌క్తి ప్రేంసాగ‌ర్ రావు
-ఇక్క‌డి దివాక‌ర్‌రావును మార్చాల‌ని కేసీఆర్‌ను కోరా
-త‌న‌కు కానీ, బీసీల‌కు కానీ టిక్కెట్టు ఇస్తామ‌ని అధిష్టానం చెప్పింది

త‌న‌ను కొనాలంటే ద‌మ్ముండాల‌ని… ప్రేంసాగ‌ర్ రావుకు ఆ ద‌మ్ముందా అంటూ మాజీ ఎమ్మెల్యే గ‌డ్డం అర‌వింద‌రెడ్డి స‌వాల్ విసిరారు. ఆయ‌న సోమ‌వారం త‌న నివాసంలో విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ స‌చివాలయంలో తాను బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను క‌లిశాన‌న‌ని స్ప‌ష్టం చేశారు. ఆయ‌న‌తో ఇక్క‌డి రాజ‌కీయాలపై చ‌ర్చించేందుకు తాను క‌లిస్తే ప్యాకేజీ మాట్లాడాన‌ని కాంగ్రెస్ పార్టీ దుష్ప్ర‌చారం చేస్తోంద‌న్నారు. అరవింద్ రెడ్డిని కొనాలంటే వెయ్యి కోట్లు ఇచ్చే దమ్ముండాలి…. ప్రేమ్ సాగర్ వెయ్యికోట్ల ఇస్తాడా సపోర్ట్ చేస్తా అని మ‌రోమారు స‌వాల్ విసిరారు.

ప్రేంసాగ‌ర్ రావు గెలిస్తే గుండారాజ్యం
ఇక్క‌డ ప్రేంసాగ‌ర్ రావు అనే వ్య‌క్తి గెలిస్తే గుండారాజ్యం వ‌స్తుంద‌ని దుయ్య‌బ‌టారు. తూర్పు ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానని కోట్ల రూపాయలు వసూలు చేశాడు పీఎస్ఆర్ అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు అర‌వింద‌రెడ్డి. ప్రేమసాగర్ అనే వ్యక్తి గెలిస్తే ప్రజలకు ఇబ్బందులు త‌ప్ప‌వ‌న్నారు. ప్రేమసాగర్ ఇంటికి బిచ్చగాడు పోతే ఆయన దగ్గరే తొమ్మిది రూపాయలు వసూలు చేస్తాడని ఎద్దేవా చేశారు.. ప్రేమ్ సాగర్ ఎమ్మెల్యే అయితే ఇక్కడ డబ్బులు రికవరీ చేసి ఆయన అప్పులు కట్టుకుంటాడన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రేమ్ సాగర్ రావును ఒడిస్తం,,గోదావరి దాటిస్తమంటూ అర‌వింద‌రెడ్డి స్ప‌ష్టం చేశారు.

బీఆర్ఎస్ అభ్య‌ర్థిని మార్చాల‌ని చెప్పిన‌..
మంచిర్యాల బీఆర్ఎస్ అభ్య‌ర్థిగా ఉన్న న‌డిపెల్లి దివాక‌ర్ రావును మార్చాల‌ని కేటీఆర్‌కు చెప్పిన‌ట్లు అర‌వింద‌రెడ్డి స్ప‌ష్టం చేశారు. 70 నుంచి 80 వేల మెజారిటీతో గెలవాలంటే మార్పు తప్పదని చెప్పాన‌ని వెల్ల‌డించారు. దివాకర్ రావును నేను నాలుగు సార్లు గెలిపించిన. ఈసారి తప్పుకొని నాకు మద్దతు ఇవ్వండంటూ ఎమ్మెల్యే న‌డిపెల్లి దివాక‌ర్‌రావును కోరారు. ఈ సంద‌ర్భంగా త‌మ‌కు కేటీఆర్ స్ప‌ష్టమైన హామీ ఇచ్చిన‌ట్లు తెలిపారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి 99.9 శాతం టికెట్ మారుస్తామని,, బిసి లకు గానీ, మీకు గాని టికెట్ కేటాయిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారని అర‌వింద‌రెడ్డి వెల్ల‌డించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like