కేసీఆర్‌కు మోదీ పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు

నేడు తెలంగాణ ముఖ్య‌మంత్రి చంద్ర‌శేఖ‌ర్ రావు పుట్టిన రోజు సంద‌ర్భంగా టీఆర్ఎస్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు వేడుక‌లు నిర్వహిస్తున్నారు. మూడు రోజుల పాటు పుట్టిన రోజు ఉత్స‌వాల‌ను జ‌రుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రికి ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించాలి అంటూ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు ప్రధాని నరేంద్ర మోడీ.”తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన దీర్ఘాయుష్షుతో ఆరోగ్యంగా జీవించాలని ప్రార్థిస్తున్నాను.” అంటూ ట్వీట్ చేశారు ప్రధాని మోడీ. కొన్ని రోజుల నుంచి తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మధ్య వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. వరి కొనుగోలు దగ్గరనుంచి విద్యుత్ చట్టాల వరకు ప్రతి దాంట్లోనూ రెండు ప్రభుత్వాల మధ్య వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. బహిరంగంగానే సీఎం కేసీఆర్ ప్రధాని మోడీ సర్కార్ పై విమర్శలు సంధిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ప్రధాని నరేంద్ర మోడీ సీఎం కేసీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like