కేటీఆర్ వ్యూహ‌ర‌చ‌న‌లో…

తెలంగాణ రాష్ట్ర స‌మితి ఏ కార్య‌క్ర‌మం చేప‌ట్టినా అది విజ‌య‌వంతం అయ్యేలా పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి క‌ల్వ‌కుంట్ల తార‌క‌రామారావు వ్యూహ ర‌చ‌న ఉంటుంది. అదే విధంగా ఇవ్వాళ నిర్వ‌హించే ధ‌ర్నాలు, నిర‌స‌న కార్య‌క్ర‌మాలు సైతం విజ‌య‌వంతం అయ్యేలా టీఆర్ ఎస్ ముందుకు సాగుతోంది.

వరి ధాన్యం కొనుగోలు పై కేంద్ర బిజెపి సర్కార్ వైఖరిని నిరసిస్తూ నేడు గులాబీ సైన్యం క‌దం తొక్క‌నుంది. రాష్ట్రవ్యాప్తంగా టిఆర్ఎస్ ఆందోళనలు నిర్వ‌హించాల‌ని ముఖ్య‌మంత్రి ఆదేశించిన నేప‌థ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 100 నియోజకవర్గాల్లో టీఆర్ ఎస్ శ్రేణులు ధర్నాలు, నిరసనలు చేప‌ట్ట‌నున్నారు. ఒక్కో నియోజకవర్గంలో మూడు వేల మందికి తక్కువ కాకుండా నిరసనలో పాల్గొనేలా వ్యూహరచన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల మంది గులాబీ సైన్యం రైతు సమస్యలపై ధర్నాలో పాల్గొంటారని నేత‌లు భావిస్తున్నారు. నిరసన సక్సెస్ అయ్యేలా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎప్పటికప్పుడు వ్యూహరచన చేస్తున్నారు. హైదరాబాదులో ఇందిరా పార్క్ వద్ద జంటనగరాల టిఆర్ఎస్ నేతల ఉమ్మడి ధర్నా చేయ‌నున్నారు. ఆయా జిల్లా ప్రధాన కేంద్రాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ సీనియర్ నేతలు కార్యకర్తలు, నాయకులు రైతుల ధర్నాలో పాల్గొంటారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో టిఆర్ఎస్ నేతలు ఆయా జిల్లా కలెక్టర్ల నుంచి ధర్నాలకు అనుమతి తీసుకున్నారు. ధాన్యం కొనుగోలు పై కేంద్రం నుంచి స్పష్టమైన వైఖరి తెలపాలని డిమాండ్ చేస్తూ ఈ ధర్నాలు నిరసనలు కొన‌సాగ‌నున్నాయి.

Get real time updates directly on you device, subscribe now.

You might also like