కుల‌, మ‌తాల‌తో రాజ‌కీయం

ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌భుత్వ విప్ ఆగ్ర‌హం

మంచిర్యాల : తెలంగాణ‌లో ప్ర‌తిప‌క్ష నేత‌లు ఒక‌రు కులం ఎజెండాగా, మ‌రొక‌రు మ‌తం ఎజెండాగా ముందుకు సాగుతున్నార‌ని ప్ర‌భుత్వ విప్ బాల్క సుమ‌న్ విరుచుకుప‌డ్డారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆయ‌న వారిపై విమ‌ర్శ‌నాస్త్రాలు సంధించారు. భార‌తీయ జ‌న‌తా పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ మ‌త ప్ర‌తిపాదిక‌న‌, తెలంగాణ కాంగ్రెస్ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి కులం ప్రాతిప‌దిక‌న జ‌నాన్ని విడ‌దీయాల‌ని చూస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. వారు కేవలం కుల‌, మ‌తాల ఆధారంగా రాజ‌కీయాలు చేస్తార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఉద్యమ సారథి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ పురోగమిస్తున్న సందర్భంలో.. ఎవరెన్ని జెండాలు, అజెండాలతో వచ్చి కుట్రలు చేసినా ఎదుర్కోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాము గెల‌మ‌ని గ్ర‌హించి ప్ర‌జ‌ల్లో చిచ్చు ర‌గిలించ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్న వారిని జ‌నం క్ష‌మించ‌ర‌ని స్ప‌ష్టం చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like