కుటుంబాన్ని పోషిస్తోంది.. మృత్యు ఒడిలోకి వెళ్లింది..

మంచిర్యాల : మ‌ంచిర్యాల జిల్లా బెల్లంప‌ల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ డ్రైవ‌ర్ నిర్ల‌క్ష్యం వ‌ల్ల ఓ యువ‌తి మృత్యువాత ప‌డింది. వివ‌రాల్లోకి వెళితే.. క‌న్నాల బ‌స్తీ 1 వార్డుకు చెందిన చింతకింది వెంకటేష్ నిర్మల దంపతుల కూతురు బావాగ్ని (21) బెల్లంపల్లి కొత్త బస్టాండ్ ఏరియాలో న‌డుచుకుంటూ వెళ్తోంది. ఇంత‌లో మంచిర్యాల నుంచి ఆసిఫాబాద్ వెళ్తున్న టీఆఎస్ 19 టీ 2259 బ‌స్సు డ్రైవ‌ర్ మూల మ‌లుపు వ‌ద్ద చూడ‌కుండానే ఆమెపైకి బ‌స్సు తీసుకువెల్లాడు. దీంతో బావాగ్ని అక్క‌డిక‌క్క‌డే మృతి చెందింది. బావాగ్ని మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వైష్ణవి డయాగ్నొస్టిక్ సెంటర్ లో పని చేస్తుండగా, విధులకు వెళ్ళే క్రమంలో ఈ ఘటన జ‌రిగింది. మృతురాలి తండ్రి వెంకటేష్ ఆటో డ్రైవర్ గా పని చేస్తుండగా ప్రస్తుతం అతడి రెండు కిడ్నీలు చెడిపోయాయి. దీంతో ఆమె పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది. ఆర్టీసీ బస్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘ‌ట‌న జ‌రిగింద‌ని మృతురాలి బంధులువు ఆరోపిస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like