మంచిర్యాల కోసం ఎన్టీఆర్ చేయ‌నిది చేసిన కేసీఆర్‌

మంచిర్యాల : మ‌ంచిర్యాల కోసం ఎన్టీఆర్ చేయ‌లేని ప‌ని కూడా కేసీఆర్ చేశార‌ట‌.. ఈ విష‌యాన్ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్వ‌యంగా ప్ర‌క‌టించారు. దివంగత ఎన్టీఆర్‌ను మంచిర్యాల జిల్లా కావాలని అడిగినా అదీ సాధ్యపడలేదని గుర్తు చేశారు. తెలంగాణ వ‌చ్చాకే అది సాధ్యం అయ్యింద‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ వెల్ల‌డించారు. యాదాద్రి జిల్లా ఏర్పాటును సైతం ఎవరూ ఊహించలేదన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో యాదాద్రి జిల్లా ఏర్పాటు కోరినా సాధ్యపడలేదని, యాదాద్రి జిల్లా ఏర్పాటును ఎవరూ ఊహించలేదని తెలిపారు. భువనగిరి జిల్లా కలెక్టరేట్‌ భవనాన్ని ఇవాళ ఆయన ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడారు. భూముల రేట్లు వట్టిగనే పెరగలేదని.. తెలంగాణ వచ్చాకే ఇది జరిగిందని అన్నారు. యాదాద్రి కూడా హైదరాబాద్‌లో కలిసిపోయిందని.. తెలంగాణ వచ్చాక సంపద బాగా పెరిగిందని కేసీఆర్ చెప్పారు. సమైక్య రాష్ట్రంలో చెరువులను నాశనం చేశారని.. వాటర్ షెడ్డింగ్‌తో భూగర్భ జలాలు పెరిగాయని సీఎం తెలిపారు. తెలంగాణ అద్భుత ప్రగతి సాధిస్తోందని.. 95 శాతం ఉద్యోగాలు స్థానికులకు వస్తాయని ముఖ్యమంత్రి తెలిపారు.

ప్ర‌ధాని మోదీకి పిచ్చి ముదిరింది..
సభలో ప్రధాని నరేంద్ర మోదీపై కేసీఆర్ తన మాటల దాడిని కొనసాగించారు. రోజులు గడుస్తున్నా కొద్ది ప్రధాని మోదీకి పిచ్చి ముదురుతోందంటూ తీవ్రమైన కామెంట్స్ చేశారు. ఆ పిచ్చితోనే రైతులను ఏడిపిస్తున్నారని అన్నారు. చెత్త పాలసీలు తీసుకువచ్చి ప్రజల జీవితాలను అస్తవ్యస్థం చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో భూగర్భ జలాలు పెరిగాయని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణలో ఎక్కడా ఎకరం భూమి రూ.25 లక్షలకు తక్కువగా లేదన్నారు. మారుమూల ప్రాంతాల్లోనూ భూముల విలువ పెరిగిందని కేసీఆర్ అన్నారు.

తెలంగాణలో ఉద్యోగాల విషయంలో కొందరు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని కేసీఆర్ అన్నారు. తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని సీఎం చెప్పారు. గొర్రెల పెంపకంలో తెలంగాణ ఇండియాలోనే నంబర్​ వన్ స్థానంలో వుందని కేసీఆర్ తెలిపారు. పుట్టిన దగ్గరి నుంచి మరణించే వరకు ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందిస్తున్నామని సీఎం గుర్తుచేశారు. దేశం ఓ పక్క వెనక్కి పోతున్నా.. రాష్ట్రం అద్భుతంగా పురోగమిస్తోందన్నారు. ప్రమోషన్ల కోసం ఉద్యోగులు పైరవీలు చేసే పరిస్ధితి వుండకూడదని.. మా ఉద్యోగాలు మాకు కావాలి అనే నినాదం మనదని కేసీఆర్ గుర్తుచేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like