మీ కుటుంబ సభ్యుడిగా సేవ చేస్తా

జ‌ర్న‌లిస్టుల‌కు విప్ బాల్క సుమ‌న్ హామీ

మంచిర్యాల : మీ కుటుంబ స‌భ్యుడిలా సేవ చేస్తాన‌ని జ‌ర్న‌లిస్టుల‌కు ప్ర‌భుత్వ విప్ బాల్క సుమ‌న్ హామీ ఇచ్చారు. బుధ‌వారం మంద‌మ‌ర్రిలో ప్రెస్ క్ల‌బ్ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ జర్నలిస్టు వృత్తి గౌరవిస్తామ‌ని, జర్నలిస్టులతో సోదరభావంతో మెలుగుతామన్నారు. మీడియా ప్ర‌జ‌ల గొంతులా నిల‌బ‌డాల‌న్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా నిలవాలని కోరారు. ఏ గొంతు లేని ప్రజలకు తామే ఒక గొంతుగా మీడియా నిలవాలని స్ప‌ష్టం చేశారు. ప్రాణాలకు తెగించి వార్తలు రాసిన చరిత్ర ఈప్రాంత జర్నలిస్టుల సొంతమ‌ని కొనియాడారు. జర్నలిస్టుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం రూ. 100 కోట్లు కేటాయించిందని, కరోనా వంటి కష్టకాలంలో జర్నలిస్టులను ఆదుకున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూమ్ లేదా ఇంటి స్థలాలను అందిస్తామ‌ని హామీ ఇచ్చారు. జర్నలిస్టుల కుటుంబాలకు విద్య, వైద్యం సంబంధిత విషయాలలో ఆర్థిక చేయూతను అందించడానికి కృషి చేస్తామ‌ని వెల్ల‌డించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like