ఎమ్మెల్యే టికెట్ కోసం ఏం చేసిందంటే…

ఎన్నికల్లో గెలవడానికి నేత‌లు చాలా ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. టిక్కెట్ కోసం చాలా కష్టపడాల్సి ఉంటుంది. అయితే కొంద‌రు నేత‌లు టిక్కెట్ కోసం వేసే ఎత్తుగ‌డ‌లు చూస్తే మూర్చ‌పోవాల్సిందే.. అలాంటి నేత గురించి ఇప్పుడు తెలుసుకుందాం…

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో కాంగ్రెస్ పార్టీ మ‌హిళా నేత రీటా యాద‌వ్‌పై దుండగులు కాల్పులు జ‌రిగిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. జనవరి 3న కాంగ్రెస్ నాయకురాలు రీటా యాదవ్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కాలుపై కాల్పులు జ‌రిపారు. దీనిపై రీటా యాద‌వ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. తాను పార్టీకి సంబంధించి పోస్టర్లు, బ్యానర్లు తీసుకుని రావడానికి వెళ్లినప్పుడు ముగ్గురు వ్యక్తులు త‌న‌పై దాడి చేసిన‌ట్లు వెల్ల‌డించారు. మొద‌ట తన వాహనాన్ని ఓవర్‌టేక్ చేసి, తనపై దుర్భాషలాడడం ప్రారంభించారని ఆమె చెప్పింది. దీనిపై స్పందించిన ఆమె కారు దిగి ఒకరిని చెంపదెబ్బ కొట్టినట్లు తెలిపింది. ఈ సంద‌ర్భంగా త‌న కాలుపై కాల్చార‌ని పోలీసుల‌కు వెల్ల‌డించింది.

ప్ర‌స్తుతం ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నికలు జ‌రుగుతున్న నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీని ఉతికి ఆరేసింది. ముగ్గురు వ్యక్తులు రీటా యాదవ్‌ను శారీరకంగా హింసించిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో గుండా రాజ్యం న‌డుస్తోంద‌ని.. మహిళలను చీరలు లాగి కాల్పులు జరిపే ఘటనలు చోటు చేసుకుంటున్నాయని యూపీ కాంగ్రెస్ ట్విట్టర్‌లో ఆరోపించింది. స్మృతి ఇరానీని టార్గెట్ చేస్తూ, రీటా యాదవ్ ప్రధానికి నల్లజెండా చూపించినందుకే ఆమెపై కాల్పులు జరిపారని యూపీ కాంగ్రెస్ తెలిపింది.

అయితే, పోలీసుల ద‌ర్యాప్తులో అస‌లు విష‌యాలు వెలుగులోకి రావ‌డంతో కాంగ్రెస్ పార్టీ నేత‌లు ఖంగుతిన్నారు. రీటా యాదవ్ వేర్వేరు సందర్భాలలో వేర్వేరు స్టేట్‌మెంట్‌లు ఇవ్వడంతో ఈ ఘటనపై పోలీసులు అనుమానాలు వ్య‌క్తం చేశారు. ఆమె డ్రైవర్‌ ఎండీ ముస్తాకిమ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా చివరకు కుట్ర బయటపడింది. త‌న స‌హ‌చ‌రుల‌తో త‌న‌పైనే దాడి చేయించుకుని కాలుపై కాల్పించుకున్న విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. లంభువా పోలీస్ క‌మిష‌న‌ర్‌ సతీష్ చంద్ర శుక్లా మాట్లాడుతూ కేసు సూక్ష్మంగా పరిశోధించి, సాక్షులతో మాట్లాడిన తర్వాత.. పార్టీలో తన రాజకీయ స్థాయిని పెంచుకోవడానికి రీటా యాదవ్ తనపై ఈ దాడికి ప్లాన్ చేసిందని వెల్ల‌డించారు. దీంతో ఆమెకు అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్ ఇస్తారని ఆశించిందన్నారు.

ఈ కుట్రకు పాల్పడిన రీటా యాదవ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఆమెతో పాటు డ్రైవర్ ఎండీ ముస్తాకిమ్, ధర్మేంద్ర యాదవ్‌తో సహా ఆమె సహచరులు కూడా కుట్రలో పాలు పంచుకున్నందుకు అరెస్టు చేశారు. దీంతో అటు కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులు పాలు కాగా, ఇటు టిక్కెట్టు కోసం నాట‌కం ఆడిన రీటా యాద‌వ్ జైలుకెళ్లింది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like