ఎమ్మెల్యేల దిష్టిబొమ్మ‌లు ద‌హ‌నం..

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దిష్టి బొమ్మ దహనం చేయడాన్ని నిరసిస్తూ బిజెపి ఆధ్వర్యంలో మంచిర్యాల‌, బెల్లంప‌ల్లి ఎమ్మెల్యేల దిష్టిబొమ్మ‌లు ద‌హ‌నం చేశారు. మంచిర్యాల‌లో బిజెపి యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు పట్టి వెంకట కృష్ణ ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తా లో మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు దిష్టి బొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు పట్టి వెంకట కృష్ణ, జిల్లా అధికార ప్రతినిధి తుల మధుసూధన్ మాట్లాడుతూ మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మంచిర్యాల అసెంబ్లీ ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. కేసిఆర్ ప్రభుత్వ అసమర్ధను కప్పి పుచ్చుకోవడానికి కేంద్రం పై నిందలు వేస్తూ రైతులను పక్కదోవ పట్టిస్తున్నారన్నారు. ఇంకొకసారి టిఆర్ఎస్ నాయకులు ఇలాంటి ఘటనలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి బోయిని హరికృష్ణ, గాజుల ప్రభాకర్, రేకందర్ వాణి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు మాధవరావు వెంకట రమణ రావు, మహిళ మోర్చా జిల్లా అధ్యక్షురాలు జోగుల దేవి, రంగ శ్రీశైలం, ఆకుల అశోక్ వర్ధన్, ముదాం మల్లేష్, మిట్టపల్లి మొగిలి, రాచకొండ సత్యనారాయణ, కొండ వెంకటేష్, బోయిని దేవేందర్, స్వామి రెడ్డి, దామెరకుంట నరసయ్య, పల్లే రాకేష్, సోమ ప్రదీప్ చంద్ర, కుదురుపాక గంగన్న, నాగుల రాజన్న, రెడ్డిమల్ల అశోక్, బుద్దరపు రాజమౌళి, అరేందుల రాజేష్, సాయి, తరుణ్, మందల స్వాతి త‌దిత‌రులు పాల్గొన్నారు.

తాండూరు మండ‌లంలో..
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారి దిష్టి బొమ్మ దహనం చేయడాన్నిబిజెపి తాండూరు మండల కమిటీ ఆధ్వర్యంలో తాండూరు మండలం ఐబీ లో బెల్లంపల్లి ఎమ్మెల్యే చిన్నయ్య దిష్టి బొమ్మ దహనం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని అవమానిస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకొకసారి చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో తాండూరు మండల అధ్యక్షులు రామగౌని మహీదర్ గౌడ్ మండల ప్రధాన కార్యదర్శి పట్టెం విష్ణు కళ్యాణ్, ఉపాధ్యక్షులు కోమండ్ల శ్రీనివాస్, సీనియర్ నాయకులు చిలువేరు శేషగిరి ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పాగిడి చిరంజీవి అసెంబ్లీ నాయకులు చిలుముల శ్రీ కృష్ణ దేవరాయలు, బీజేవైఎం మండల అధ్యక్షులు చజ్నాల రాహుల్, మైనార్టీ మోర్చా మండల అధ్యక్షులు మహమ్మద్ ఖమృద్ధిన్, నాయకులు సాయిరాం శ్రీకాంత్ ఏసు బాలయ్య తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like