మొక్క‌లు నాటి… అన్నం పెట్టి..

మంచిర్యాల : టీఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ జన్మదిన సందర్భంగా మంచిర్యాల‌లో ఆయ‌న పుట్టిన రోజు వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు. ఎమ్మెల్యే న‌డిపెల్లి దివాక‌ర్‌రావుతో పాటు, న‌డిపెల్లి ట్ర‌స్ట్ చైర్మ‌న్‌, యువ‌నాయకుడు విజిత్ ఆధ్వ‌ర్యంలో ప‌లు కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు.

-ఇటీవలి వరదలకు ముంపునకు గురైన మంచిర్యాల పట్టణంలోని ఎన్టీఆర్ న‌గ‌ర్‌లో శ్ర‌మ‌దానం చేశారు.పేరుకుపోయిన చెత్తాచెదారం తొల‌గించి, వీధులు శుభ్రం చేశారు. కార్య‌క్ర‌మంలో నడిపెల్లి విజిత్ కుమార్, మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య,పట్టణ పార్టీ ప్రెసిడెంట్ పల్లపు తిరుపతి పాల్గొన్నారు.
-నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శివాలయంలో మొక్కలు నాటారు. ఎమ్మెల్యే న‌డిపెల్లి దివాక‌ర్‌రావు, విజిత్,మున్సిపల్ చెర్మన్ ఈసంపల్లి ప్రభాకర్, వైస్‌ చెర్మన్ తోట శ్రీనివాస్, టీబీజీకేఎస్ నేత‌లు పాల్గొన్నారు.
-మంచిర్యాల పట్టణం లోని విశ్వనాథ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రెడ్ క్రాస్ సొసైటీలో విజిత్ ఆధ్వ‌ర్యంలో అన్న‌దాన‌ కార్యక్రమం నిర్వహించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like