రెబ్బనలో రేషన్ మాఫియా

-కేటుగాళ్లకు వనరుగా మారిన రేషన్ బియ్యం
-కోట్లు కురిపిస్తున్న పేదల బియ్యం
-ఓ జాతీయ పార్టీ నేత గుప్పిట్లొ దందా

Ration mafia in Rebbana:అవి పేదల ఆకలి తీర్చే బియ్యం కానీ అక్రమార్కులకు కోట్లు తెచ్చి పెడుతున్నాయి. అడ్డదారులో వ్యాపారం చేసే కేటుగాళ్లకు ఈ బియ్యం ఆదాయ వనరుగా మారింది. పేదల బియ్యం రాష్ట్ర ఎల్లలు దాటిపోతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారు. కొమురం భీం జిల్లా రెబ్బనలో రేషన్ బియ్యం తరలింపు ఓ తంతుగా మారింది. దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్న రీతిలో జోరుగా సాగుతున్న రేషన్ బియ్యం మాఫియాపై స్పెషల్ స్టొరీ..

ప్రజా సంక్షేమ పధకాలు పక్కదారి పడుతున్నాయి.పేదల ఆకలి తీర్చాల్సిన రేషన్ బియ్యం పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. తెలంగాణలోని కొమురం భీం జిల్లా రెబ్బనలో జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణా వ్యాపారం ఓ మాఫియాగా మారింది. రేషన్ బియ్యం అక్రమ రవాణా జిల్లాలో కొందరికి ఉపాధిగా మారింది. ఈ దందాతో వ్యాపారులు కోట్లు గడిస్తున్నారు. ఇక్కడ ఒక వ్యాపారి నిత్యం 8 నుంచి 10 లారీల వరకు బియ్యం ఇతర రాష్ట్రాలకు పంపిస్తున్నాడు. కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి రెబ్బనకు పెద్ద ఎత్తున బియ్యం వస్తున్నాయి. ఆటోలు,టాటా ఏసీల ద్వారా చిన్న వ్యాపారులు రెబ్బనకు తీసుకువచ్చి అమ్ముతున్నరు. వారి దగ్గర రూ. 14 కు కొంటున్న ఆ వ్యాపారి పక్క రాశ్ట్రాల్లో మాత్రం రూ. 26 నుంచి రూ. 28 చొప్పున అమ్ముతున్నాడు.

మహారాష్ట్ర,ఛత్తీస్‌గఢ్ లకు రవాణా
తెలంగాణ బియ్యం అటు మహారాష్ట్ర,ఇటు ఛత్తీస్‌గఢ్ వరకు రవాణా అవుతున్నాయి. రెబ్బన నుంచి ఆసిఫాబాద్, వాంకిడి మీదుగా మహారాష్ట్ర వెలుతున్నాయి. మహారాష్ట్రలోని మూల్, గడ్చిరోలి జిల్లా వడ్సా వరకు లారీల ద్వారా దందా కొనసాగుతోంది. ఇక ఛత్తీస్‌గఢ్, రాజ్ నంద్ గావ్, రాయిపూర్ వరకు ఈ దందా యధేచ్ఛగా కొనసాగుతోంది. దొంగ వే బిల్లులు సృస్టించి మరి లారీల్లో బియ్యం తరలిస్తున్నరు. రెబ్బన నుంచి నిత్యం 8 నుంచి 10 లారీల వరకు బియ్యం ఇతర రాష్ట్రాలకు వెలుతున్నయి అంటే పరిస్థితి అర్దం చెసుకోవచ్చు.

ముందు పైలెట్ వాహనాలు.
ఈ బియ్యం రవాణా చాలా పకడ్భందీగా సాగుతుంది. లారీలు బయలుదేరే ముందు పైలెట్ వాహనాలు వెళ్తాయి. ముందు కారులో వెళ్లే వ్యక్తులు ఎప్పటికి అప్పుడు సమాచారం చేరవేస్తుంటారు. ఎవరైనా అధికారులు ఉన్నరా..? పరిస్థితి ఏంటి..? అనే విషయంలో చాలా అప్రమత్తంగా ఉంటూ వ్యవహారం చక్కబెడుతుంటారు.రెబ్బన,కాగజ్ నగర్ కు చెందిన రెండు లారీలను మాత్రమే తరచుగా వాడుతారు. ఇక అంధ్ర ప్రాంతానికి చెందిన లారీలను ఎక్కువగా వినియోగిస్తారు. వీటితో పాటు ఛత్తీస్‌గఢ్ లారీల్లో ఎక్కువగా బియ్యం తరలివెలుతున్నయి.

ఓ జాతీయ పార్టీ నేత గుప్పిట్లో దందా
ఇక్కడ బియ్యం తరలిస్తున్న వ్యాపారి ఓ జాతీయ పార్టీ నేత కావడంతో వ్యవహరం గుట్టు చప్పుడు కాకుండా సాగుతోంది. అంతేకాకుండా, ఎక్కడిక్కడ మామూళ్ళు కూడ నడుస్తుండటంతో అందరూ చూసిచూడంట్లు పోతున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like