రికార్డు క‌లెక్ష‌న్లు

-ప్రీమియ‌ర్స్ క‌లెక్ష‌న్స్ రెండు మిలియ‌న్స్ దాటిన RRR
-ఈ రికార్డ్‌ను సాధించిన తొలి ఇండియ‌న్ సినిమా ఇదే

ఎప్పుడో రిలీజ్ కావాల్సిన RRR సినిమా క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. ఎట్ట‌కేల‌కు ఈ సినిమా మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా బ్ర‌హ్మాండ‌మైన రిలీజ్‌కు సిద్ధ‌మ‌వుతోంది.

బాహుబ‌లి సినిమాతో తెలుగు సినిమా ప్ర‌పంచాన్ని ఒక రేంజ్‌కు తీసుకువెళ్లాడు ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి. ఆ చిత్రం త‌ర్వాత జ‌క్క‌న్న తీసే సినిమా ఎలా ఉంటుందోన‌ని అంద‌రూ ఆతృత‌గా ఎదురుచూశారు. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్.. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో RRR సినిమాను అనౌన్స్ చేసి అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేశారు. RRR కు సంబంధించి ప్రోమోలు, సాంగ్స్‌, టీజ‌ర్‌, ట్రైల‌ర్ ఇలా అన్నివిష‌యాల‌తో ఫ్యాన్స్‌ను, ఆడియెన్స్‌ను అల‌రిస్తూ వ‌చ్చాయి.

బాహుబలితో బాక్సాఫీస్ రికార్డులను తిరగ రాసిన రాజమౌళి RRR తో ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తారోనిన ట్రేడ్ వ‌ర్గాలు ఆసక్తిగా ఎదురు చూశాయి. అంద‌రూ ఊహించిన‌ట్లే రాజ‌మౌళి.. రామారావు.. రామ్ చ‌ర‌ణ్‌.. ట్రిపుల్ ఆర్ కాంబినేష‌న్ కొత్త రికార్డుల వేట‌ను ప్రారంభించింది. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు.. ఓవ‌ర్ సీస్ విష‌యానికి వ‌స్తే RRR ప్రీమియ‌ర్స్ క‌లెక్ష‌న్స్ ఇప్ప‌టికే రెండు మిలియ‌న్స్‌ను క్రాస్ చేసేసింది. మూడు మిలియ‌న్ డాల‌ర్స్ దిశ‌గా అడుగులు వేస్తుంది. రిలీజ్ స‌మ‌యానికి అది మూడు మిలియ‌న్ మార్క్‌ను దాటేస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. అంటే ఓవ‌ర్ సీస్‌లో ప్రీమియ‌ర్స్‌కే RRR రూ.20 కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌డుతుంద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. ప్రీమియ‌ర్స్ ప‌రంగా రెండు మిలియ‌న్ డాల‌ర్స్ మార్కును చేర‌డం అనేది RRR సాధించిన తొలి రికార్డ్‌. ఈ రికార్డ్‌ను సాధించిన తొలి ఇండియ‌న్ సినిమా కూడా ఇదే కావడం విశేషం.

RRR ఓ ఫిక్ష‌న‌ల్ పీరియాడిక్ డ్రామా. ఇందులో కొమురం భీమ్‌గా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌.. మ‌న్యం వీరుడు అల్లూరి సీతా రామరాజుగా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టించారు. ఇంకా బాలీవుడ్ స్టార్స్ అజ‌య్ దేవ‌గ‌ణ్‌, ఆలియా భ‌ట్‌.. హాలీవుడ్ స్టార్స్ ఒలివియా మోరిస్, రే స్టీవెన్ స‌న్‌, అలిస‌న్ డూడి త‌దిత‌రులు న‌టించ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. ఇటు మెగా ఫ్యాన్స్‌.. అటు నంద‌మూరి ఫ్యాన్స్ సినిమా కోసం ఎంతో ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like