స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించండి

ఏరియా ఆసుపత్రి అడిషనల్ చీఫ్ మెడికల్ అధికారికి వినతిప‌త్రం

ఆర్‌జీ 3 డిస్పెన్స‌రీలో ఉన్న స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని సింగరేణి కోల్ మైన్స్ కార్మిక్ సంఘ్ అధ్యక్షులు యాదగిరి సతయ్య డిమాండ్ చేశారు. సోమ‌వారం రామగుండం ఏరియా ఆసుపత్రి అడిషనల్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్ట‌ర్ కిరణ్ రాజ్ కు విన‌తిప‌త్రం స‌మర్పించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ డిస్పెన్సరీ లో పారమెడికల్ సిబ్బంది కొరత ఉందన్నారు. వెంట‌నే ఇద్దరు స్టాఫ్ నర్సులు, ఒక వార్డ్ బాయ్ ని, ఒక స్కావెంజర్ నియమించాలన్నారు. ప్లేడే రొజులలో డిస్పెన్సరీ లో మూడు షిఫ్టులకు ముగ్గురు వార్డ్ అసిస్టెంట్ లను ఉండేలా ఏర్పాటు చేయాలన్నారు. ప్రస్తుతం ప్లేడే రోజులలో సెకండ్ షిఫ్ట్ లో స్టాఫ్ నర్స్ మాత్రమే ఉంటోందని చెప్పారు. ఆక్సిడెంట్ వస్తే కేస్ ను షిఫ్ట్ చేసే వారు లేకుండా పోతున్నారు.కోవిడ్ పేషెంట్ల‌ను ఇతర పేషెంట్ల‌ను ఒకే అంబులెన్స్ లో పంపుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కనిసానికి ఫిమిగేషన్ పెట్టకుండా శానిటేషన్ సైతం చేయకుండా అంబులెన్స్ లను వాడుతున్నారని చెప్పారు. డిస్పెన్సరీ కి ప్రత్యకమైన ఫిమిగేషన్ ఏర్పాటు చేయాలని ఆయ‌న ఈ సంద‌ర్భంగా డిమాండ్ చేశారు. ఒక స్కావెంజర్ ఉండటం వల్ల రెండో షిఫ్టులో ఆక్సిడెంట్ కేసులు వస్తే రక్తమరకలతో డిస్పెన్సరీ అలాగే ఉంటుందన్నారు. తక్షణమే రెండో షిఫ్టులో స్కావెంజర్ ను ఏర్పాటు చేయాలన్నారు. అంబులెన్స్ డ్రైవర్లు మూడు షిఫ్టులకు ముగ్గురు డ్రైవర్లు ఉండేలా ఏర్పాటు చేయాలని కోరారు.ఒకే డ్రైవర్ 24 గంటలు మూఢుషిఫ్టులు చేస్తున్నాడని, అంబులెన్స్ ప్రమాదాలకు గుర‌య్యే అవ‌కాశం ఉంద‌న్నారు. ఈ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించి కార్మికులు, కార్మిక కుటుంబ సభ్యులు మంచి వైద్యం అందించాలన్నారు. కార్యక్రమంలో కేంద్ర ఉపాధ్యక్షుడు వై సారంగపాణి, డిప్యూటీ సెక్రటరీ పెండం సత్యనారాయణ,గాజుల వెంకటస్వామి, ఆర్జీ3 ఇంచార్జ్ అరుకాల ప్రసాద్, అనుప రమేష్, వెల్లెపు సురేష్ పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like