సమ్మెతో కేంద్ర ప్రభుత్వం మెడలు వంచాలి

నాలుగు బొగ్గుబావులను సింగరేణికి కేటాయించాలి - సమ్మెను విజయవంతం చేయండి

సింగరేణిలో నాలుగు బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను వెంటనే ఆపివేయాల‌ని సింగ‌రేణి కార్మిక సంఘాల జేఏసీ నేత‌లు కోరారు. శనివారం సింగరేణి జాయింట్ యాక్ష‌న్ క‌మిటీ ఆధ్వర్యంలో అబ్బాపూర్ బీపీఏ ఓసి 2 లో స‌మావేశం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు నాయ‌కులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నాలుగు బొగ్గు బ్లాక్‌ల‌ను ప్రైవేటీక‌ర‌ణ చేస్తూ నిర్ణ‌యం తీసుకుంద‌ని అది స‌రికాద‌న్నారు. ఆ నోటిఫికేష‌న్ వెంట‌నే ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేశారు. ఆ బావుల‌ను య‌థావిధిగా సింగ‌రేణికి అప్ప‌గించాల‌ని డిమాండ్ చేశారు. హక్కుల సాధన కోసం డిసెంబరు 9, 10, 11 తేదీలలో జరిగే సమ్మెలో సింగరేణి కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, టీబీజీకేఎస్, హెచ్ఎంఎస్ నాయకులు పేరం శ్రీనివాస్, ప్రకాష్ రావు, సోమారాపు తిరుపతి, పార్వతి సత్తయ్య, కృష్ణ మోహన్,శేషు,బ‌య్య మొగిలి, కోటేశ్వర్ రెడ్డి,సంపత్ రావు తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like