జాతీయ జెండా త‌ల‌కిందులుగా..

Under the national flag: భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాతీయ జెండా త‌ల‌కిందులుగా ఆవిష్క‌రించారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా కలెక్టరేట్లో జాతీయ జెండాను ప్రభుత్వ సలహాదారు అనురాగ్ శర్మ ఆవిష్కరించారు. ఈ క్రమంలో జాతీయ జెండాను అనురాగ్ శర్మ తలకిందులుగా ఆవిష్కరించారు. దీంతో ఆయ‌న ఎస్పీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

వెంటనే స్పందించిన ఎస్పీ సురేందర్ రెడ్డి ఈ ఘ‌ట‌న‌లో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన ఆర్ఎస్ఐ సదానందంను సస్పెండ్ చేశారు. అయితే ముఖ్య అతిథికి అందించే దారం ఒక దానికి బదులుగా పొరపాటున ఇంకొక దారం RSI సదానందం అందించడానికి ఎస్పీ కార్యాలయం వివరణ ఇచ్చింది. అందుకే ఈ ఘటనకు బాధ్యుడిగా RSI ను ఎస్పీ సురేందర్ రెడ్డి సస్పెండ్ చేసినట్టు స్పష్టం చేసింది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like