వారిని విధుల్లోకి తీసుకోక‌పోతే ఆందోళ‌న‌

కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో నిర‌స‌న

బెల్లంప‌ల్లి ప‌ట్ట‌ణంలో కేటీఆర్ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా విధుల‌కు గైర్హాజైన సిబ్బందికి మెమోలు జారీ చేయ‌డం ఏ మేర‌కు స‌మంజ‌స‌మ‌ని కాంగ్రెస్ పార్టీ నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బెల్లంప‌ల్లి లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో మున్సిప‌ల్ కార్యాల‌యం ఎదుట ఆందోళ‌న నిర్వ‌హించారు. బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులు కంకటి.శ్రీనివాస్ గారి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండి ప్రభాకర్ ఆధ్వ‌ర్యంలో ఈ ధ‌ర్నా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా నేత‌లు మాట్లాడుతూ కేటీఆర్ పుట్టిన రోజు వేడుక‌లకు హాజ‌రుకాకుంటే మెమోలు జారీ చేస్తారా..? అని ప్ర‌శ్నించారు. ఆ రోజు రాక‌పోతే మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ మెమోలు జారీ చేయ‌డం ఏమిట‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. న‌లుగురు కార్మికుల‌ను విధుల్లోకి తీసుకోక‌పోతే కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like