వీడియో జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి

మంచిర్యాల : తెలంగాణ వీడియో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం పని చేస్తామని వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు జుట్టు రమేష్, ప్రధాన కార్యదర్శి అనుమండ్ల శ్రీనివాస్ స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మీడియా గెస్ట్ హౌస్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో మంచిర్యాల వీడియో జర్నలిస్టు అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సంద‌ర్బంగా వారు మాట్లాడుతూ వృత్తి పరంగా విడియో జర్నలిస్టులు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. సమాజంలో ప్రజా స‌మ‌స్య‌లు బ‌య‌ట‌కు తేవ‌డంతో వారు ముందుంటున్నార‌ని చెప్పారు. అర్హులైన వీడియో జర్నలిస్టులకు ప్రభుత్వం నుంచి అందించే సంక్షేమ పథ‌కాలను సకాలంలో అందించేందుకు ముందుకు సాగుతామన్నారు. ప్రతి వీడియో జర్నలిస్టుకు డబుల్ బెడ్ రూమ్ ప‌థ‌కం అందేలా యూనియన్ ఆధ్వ‌ర్యంలో పోరాటం చేస్తామన్నారు.

నూత‌న కార్య‌వ‌ర్గం ఇదే..
తెలంగాణ వీడియో జర్నలిస్టుల సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడుగా జుట్టు రమేష్, ప్రధాన కార్యదర్శి గా అనుమండ్ల శ్రీనివాస్, ఉపాధ్యక్షుడిగా కన్నురి సారయ్య, సహా కార్యదర్శి గా ఈసంపల్లి రమేష్, కోశాధికారి గా కొత్తపల్లి సతీష్, ప్రచార కార్యదర్శిగా ఈర్ల శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా రామంచ శ్రీనివాస్, మోద్దుమ్పురం సంతోష్, సభ్యులు గోవిందుల మల్లేష్, ఎల్లబెల్లి శ్రీకాంత్, నరేడ్ల రాము, వేముల రవి, పులిపాక శ్రీనివాస్ ను సభ్యులుగా ఎన్నుకున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like