టీఆర్ ఎస్ విజ‌య‌గ‌ర్జ‌న స‌భ వాయిదా

టీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భవించి రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయగర్జన పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సిద్ధం అవుతోంది గులాబీ పార్టీ.. అయితే.. టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించ తలపెట్టిన విజయగర్జన సభ మొదట ఈ నెల 15న నిర్వహించాలనుకున్నా.. కొన్ని కారణాలతో దానిని 29వ తేదీకి వాయిదా వేశారు.. తెలంగాణ దీక్షాదివస్‌ అయిన ఈ నెల 29వ తేదీన సభను నిర్వహించాలని పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. అయితే, మరోసారి ఈ సభ వాయిదా పడింది.. ఈ సారి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ సెగ.. ఈ భారీ బహిరంగ సభను తాకింది.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ ఇవాళే వెలువడింది.. దీంతో.. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది.. దీని ప్రభావం వరంగల్‌లో నిర్వహించనున్న సభపైపై పడింది.. ఇక, ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ మరోసారి తన భారీ బహిరంగసభను వాయిదా వేసుకుంది.

నిజానికి విజయగర్జన సభ ఉంటుందో లేదో అనే అనుమానాలు మొదట్నుంచి ఉన్నాయి. ఓవైపు రైతులు తమ భూములు ఇవ్వమని ధర్నాలు చేస్తున్నారు. ఇంకోవైపు హుజూరాబాద్‌ రిజల్ట్‌ తేడా కొట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో సభ ఉండదనే వార్తలు వచ్చాయి. సరిగ్గా ఇదే టైమ్‌ లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ రావడంతో మళ్లీ వాయిదా తప్పలేదు. తర్వాత అయినా ఉంటుందో లేదో అనేది అనుమానమేనని అంటున్నారు విశ్లేషకులు.

హుజూరాబాద్‌ లో విజయావకాశాలు లేవని గ్రహించి ప్లీనరీని ముందే ముంగించారు కేసీఆర్‌. రిజల్ట్‌ తర్వాత జరిపితే కార్యకర్తల్లో నిరాశ పెరిగిపోతుందనే భయంతో ఎప్పుడో జరపాల్సిన కార్యక్రమ షెడ్యూల్‌ ని ముందుకు జరిపారు. ఇప్పుడు విజయగర్జన సభ కూడా నిర్వహించాలా..? వద్దా..? అనే సందిగ్ధంలో కేసీఆర్‌ ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like