వర్క్ షాప్ లో మంచినీరు అందించండి
Singareni: బెల్లంపల్లి ఏరియాలోని ఏరియా వర్క్ షాప్ లో వారం రోజుల నుండి రక్షిత మంచినీరు అందుబాటులో లేక పోవడం శోచనీయని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో వర్క్ షాప్ కార్మికులు శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీబీజీకేఎస్ వర్క షాప్ పిట్ కార్యదర్శి కందుల తిరుపతి మాట్లాడుతూ రక్షిత మంచినీరు అందించాలని అధికారులకు వారం రోజుల నుంచి మొరపెట్టుకున్న పట్టించుకునే వారే లేరన్నారు. మినరల్ వాటర్ ప్లాంట్ చెడిపోయి 15 రోజుల నుండి సరియైన తాగునీరు లభించక కార్మికులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఏరియా ఇంజనీరు తిరుమలరావు, వర్క్ షాప్ ఇంజనీరు నాగభూషణం కార్మికుల వద్దకు వచ్చి తొందరగా మినరల్ వాటర్ ప్లాంట్ బాగు చేయించి రక్షిత మంచినీరు అందిస్తామని హామీ ఇచ్చారు. దీంతో ధర్నా విరమించి కార్మికులు విధులకు హాజరు అయ్యారు. కార్యక్రమంలో టీబీజీకేఎస్ ఫిట్ కార్యదర్శి తిరుపతి వర్క్ మెన్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ, దాస్, ఎం.కుమారస్వామి, రాజేశం, వైకుంఠం, విద్యాసాగర్, శ్రీనివాస్, సురేష్, వీరు రాజేష్ కనకయ్య తదితరులు పాల్గొన్నారు.