వినాయక మండపాల వద్ద అప్రమత్తంగా ఉండాలి

పోలీస్ కమిషనర్ శ్రీనివాస్

వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన గణేశ్ మండపాల వద్ద నిర్వాహకులు నిబంధనలు పాటించాలని రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీనివాస్ సూచించారు. మంచిర్యాల పట్టణ కేంద్రంలోని చింతపండువాడ ఏరియా సిద్ధి వినాయక, 100 ఫీట్ రోడ్ అంజనీపుత్ర గణేశ్ మండపంతో పాటు మరికొన్ని ప్రధాన కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన గణేశ్ మండపాలను ఆదివారం రాత్రి సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వహకులకు సూచనలు చేశారు. పోలీసుశాఖ ఇచ్చిన నిబంధనలకు అనుగుణంగా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అగ్నిమాపక పరికరాలు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. విద్యుత్ ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాట్లను పరిశీలించారు. సమస్యలు ఉంటే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. నిమజ్జనం రోజు తీసుకోవాల్సిన నిబంధనలు, ఆంక్షలు పాటించాలన్నారు. ఎలాంటి గొడవలు, అవాంఛనీయ సంఘటనలు, ప్రమాదాలు జరగకుండా శాంతియుత వాతావరణంలో శోభయాత్ర సాగేలా పోలీసులకు సహకరించాలని కోరారు. బందోబస్తు, పెట్రోలింగ్ పకడ్బందీగా నిర్వహించాలని, మండపం వద్ద ఏర్పాటు చేసిన పాయింట్ బుక్ లను చెక్ చేయాలని పోలీసులకు సూచించారు. సీపీ వెంట మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్, ఏసీపీ ప్రకాశ్, పట్టణ ఇన్స్పెక్టర్ బన్సీలాల్ ఉన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like