మంచిర్యాలలో అక్రమ నిర్మాణం కూల్చివేత
మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీ ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 42లో అక్రమంగా నిర్మించిన భవనాన్ని కూల్చివేశారు. బీఅర్ఎస్ నేత డీకొండఅన్నయ్యకి చెందిన ఐదు ఫ్లోర్ల బిల్డింగు పోలీసు బందోబస్తు మధ్య మున్సిపల్, రెవెన్యూ శాఖ అధికారులు కూల్చివేశారు. ఇంటి యజమానిని ముందస్తు చర్యగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కూల్చివేతను అడ్డుకోవడానికి ప్రయత్నం చేసిన కుటుంబ సభ్యులను పోలీసులు స్టేషన్ తరలించిచారు. నస్పూర్ మున్సిపాలిటీలోని 42 సర్వే నెంబర్ లో బీఆర్ఎస్ నేత డీకొండ అన్నయ్య అక్రమంగా ఐదంతస్తుల బిల్డింగ్ నిర్మించారని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు.
భవన నిర్మాణానికి సర్వే నంబర్ 40లో అనుమతులు తీసుకుని సర్వే నంబర్ 42లో భావన చేపట్టారని నస్పూర్ మున్సిపల్ కమిషనర్ సతీష్ తెలిపారు. 2022 నుంచి నోటీసులు ఇస్తున్నా డీకొండ అన్నయ్య పట్టించుకోలేదన్నారు. 15రోజుల కిందట కూడా నోటీసులు జారీ చేశామని చెప్పారు. అయినా అటువైపు నుండి రెస్పాండ్ రాకపోవడంతో పోలీస్ అధికారుల సహాయంతో ఐదంతస్తుల భవనాన్ని కూల్చివేస్తున్నామని స్పష్టం చేశారు.