పోడు రైతుల ఆందోళన
పోడు భూముల వ్యవహారంలో తమకు న్యాయం చేయాలని పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. సబ్‌కలెక్టర్ ఈ విషయంలో జోక్యం చేయాలని కోరుతూ ధర్నాకు దిగారు. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు ఇటికెల పహాడ్ పోడు రైతులు ధర్నా నిర్వహించారు. సిర్పూర్ టీ మండలం ఇటికెల పహాడ్లో తాము ఎన్నో ఏండ్లుగా పోడు భూములు సాగుచేస్తున్నామని రైతులు వెల్లడించారు. ఈ పోడు భూములకు పట్టాలు ఇప్పిస్తామని గ్రామానికి చెందిన కొందరు పెద్దమనుషులు ఒక్కో కుటుంబానికి రెండు వేల రూపాయలు, ఎకరానికి ఏడువందల చొప్పున వసూలు చేశారని తెలిపారు. అయితే ఈ భూములు మాకు దక్కే అవకాశం లేకపోవడంతో ఆందోళన చెందుతున్నట్లు పేర్కొన్నారు. దీనిపై గ్రామానికి చెందిన బీసీ రైతులు సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేశారు. సబ్ కలెక్టర్ శ్రద్దా శుక్లా ను న్యాయం చేయాలని కోరారు.