హైడ్రా అధికారులపై కోర్టు సీరియస్
హైదరాబాద్‌లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల్లో ఉన్న ఆక్రమణలను కూల్చివేసేందుకు హైడ్రా బుల్డోజర్లు దూసుకెళ్తున్నాయి. అయితే, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు హైకోర్టు కీలక ఆదేశాలు చేసింది. వచ్చే సోమవారం ఉదయం 10.30 గంటలకు కోర్డు ఎదుట హాజరవ్వాలంటూ రంగనాథ్‌ను ఆదేశించింది. ఇటీవల అమీన్‌పూర్‌లో ఓ భవనాన్ని హైడ్రా కూల్చివేయగా.. కోర్టులో పెండింగ్‌లో ఉన్న భవనాన్ని ఎలా కూలుస్తారంటూ హైకోర్టు ప్రశ్నించారు. ఈ విషయం మీద.. వ్యక్తిగతంగానైనా లేదా వర్చువల్‌గానైనా కోర్టుకు సమాధానం చెప్పాలని ఉన్నత న్యాయస్థానం హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ని ఆదేశించింది. హైదరాబాద్‌లో ఓవైపు హైడ్రా కూల్చివేతలు జోరుగా సాగుతుండగా.. మరోవైపు మూసీ పరివాహక ప్రాంతాల్లోని నివాసాలకు మార్కింగ్ జరుగుతున్న నేపథ్యంలో.. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేయటం ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.