బిగ్ బ్రేకింగ్/ ఏసీబీ దాడులు.. తహసిల్దార్, పంచాయతీ కార్యదర్శి అరెస్ట్
ACB raids.. Tehsildar, Panchayat secretary arrested: తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ఏసీబీ దాడుల్లో తహసిల్దార్, పంచాయతీ కార్యదర్శి అరెస్ట్ చేశారు. కొమురం భీం జిల్లా జైనూర్ మండలం తహసిల్దార్ కార్యాలయంలో ఏసీబీ డిఎస్పీ రమణ మూర్తి సీఐ కృష్ణ కుమార్ ఆధ్వర్యంలో ఏసీబీ దాడులు నిర్వహించారు. జెండాగూడ సీసీ రోడ్లకు సంబంధించిన బిల్లు రూ. 9,10,000 చెక్కులు ఇచ్చేందుకు శుభోద్ అనే ఒక కాంట్రాక్ట్ దగ్గర 12,000 వేలు లంచం డిమాండ్ చేశారు. ఈ లంచం తీసుకుంటూ జైనూర్ తహసిల్దార్ తిరుపతి జెండగుడా పంచాయతీ కార్యదర్శి శేఖర్ లు పట్టుబడ్డారు. ఇద్దరీపై కేస్ నమోదు చేసినట్లు డిఎస్పీ రమణమూర్తి వెల్లడించారు.