సింగరేణి క్వార్టర్ కబ్జా యత్నం
Singareni:సింగరేణి క్వార్టర్ కబ్జాకు అధికార పార్టీ నేత ప్రయత్నించడంతో కలకలం రేగింది. బెల్లంపల్లి పట్టణం స్టేషన్ రోడ్డు కాలనీలో సింగరేణి సీ టైప్ క్వార్టర్లు ఉన్నాయి. కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీ నేతల కన్ను వాటిపై పడింది. ఒక క్వార్టర్ కబ్జా చేసెందుకు అధికార పార్టీ నేత ప్రయత్నం చేశారు. గురువారం ఎస్ అండ్ పీసీ సిబ్బంది అతన్ని బయటకు పంపే ప్రయత్నం చేశారు. అయితే తాను ప్రజాప్రతినిధులకు చెప్పి తన పేరుతో క్వార్టర్ చేయించుకుంటానని దబా యించారు. అయితే సింగరేణి సెక్యూరిటీ సిబ్బంది అలాంటివి కుదరవని మీ పేరుపై క్వార్టర్ అలాట్మెంట్ చేయించుకున్నాకే రావాలని చెప్పి బయటకు పంపించారు. ఆ క్వార్టర్ కి తాళం వేసి తమ అధీనంలోకి తీసుకున్నారు.