బ్రేకింగ్: గుడిహత్నూర్ లో ఉద్రిక్తత
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ లో ఉద్రిక్తత నెలకొంది. మండల కేంద్రం ఎస్సీ కాలనీ ఓ యువకుడు మైనర్ బాలికను అపహరించి అత్యాచారం చేశాడని మైనర్ బాలిక బంధువుల ఆందోళన నిర్వహించారు.యువకుడి ఇంటిపై రాళ్ళదాడి చేయడంతో పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో పోలీసు వాహనం అద్దాలు సైతం పగిలాయి. పలువురు పోలీసులు సైతం గాయాల పాలయ్యారు. సిఐ తలకు గాయాలు కావటంతో రిమ్స్ తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందో బస్తు నిర్వహిస్తున్నారు.