అల్లు అర్జున్‌కు రెగ్యులర్ బెయిల్‌

Allu Arjun: స్టార్ హీరో అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు బిగ్ రిలీఫ్ క‌ల్పించింది. సంథ్య థియేటర్ తొక్కిసలాట కేసులో షరతులతో కూడిన రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. రూ. 50 వేల రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. రిమాండ్ ముగిసిన నేపథ్యంలో ఇటీవల జరిగిన కోర్టు విచారణకు అల్లు అర్జున్ వర్చువల్ గా హాజరయ్యారు. అదే రోజున రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన తరపు న్యాయవాదులు పిటిషన్ వేశారు. రెగ్యులర్ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు ఈ రోజు తీర్పును వెలువరించింది. కాగా, బెయిల్ మంజూరు సందర్భంగా కోర్టు అల్లు అర్జున్ కు పలు షరతులు విధించింది. ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో హాజరుకావాలని ఆదేశించింది. ఈ కేసులో సాక్షులను ప్రభావితం చేయరాదని స్పష్టం చేసింది.

You might also like