పెండ్లి బ‌రాత్‌లో లొల్లి.. క‌త్తిపోట్లు

నిర్మల్ మండలం రత్నాపూర్ కాండ్లి తండాలో జ‌రిగిన ఓ పెళ్లి ఊరేగింపు క‌త్తిపోట్ల‌కు దారి తీసింది.. వివ‌రాల్లోకి వెళితే… పెండ్లి బ‌రాత్ జ‌రుగుతుండ‌గా, శ్రీకర్, రాజు అనే ఇద్దరు యువకుల మధ్య వాగ్వావాదం చోటు చేసుకుంది. డాన్స్ చేసే విషయంలో వీరిద్ద‌రి మ‌ధ్య గొడవ జ‌రిగింది. దీంతో శ్రీకర్ అనే యువకుడిపై రాజు కత్తితో దాడి చేశాడు. క‌త్తి త‌ల‌లోనే ఉండిపోయింది. శ్రీకర్ తలకు తీవ్ర గాయాలు కావ‌డంతో మెరుగైన చికిత్స నిమిత్తం నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు రాజు పోలీసుల అదుపులో ఉన్నారు. నిర్మల్ రూరల్ పోలీసులు. పోలీసులు హ‌త్యాయ‌త్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

You might also like