గోరింటాకు సంబురాలు
ఆషాడ మాసం సందర్భంగా సోమవారం వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో గోరింటాకు సంబురాలు, ఆడపడుచులకు మనసారే కార్యక్రమం నిర్వహించారు. వాసవి క్లబ్ తాండూర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రెబ్బెన తాండూర్ మండలాల వాసవి క్లబ్ సభ్యులు మహిళామణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి అందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ క్లబ్ ఆధ్వర్యంలో ఆడపడుచుకు మన సారే ద్వారా పసుపు కుంకుమ గాజులు పూలు పండ్లు చీర జాకెట్ అందించారు.
అనంతరం గోరింటాకు సంబురాలలో మహిళలు పాల్గొని గోరింటాకు దంచి ఒకరికొకరు పెట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వాసవియన్ గోల్డెన్ స్టార్ కేసీజీఎఫ్ కే. సంతోష్ కుమార్, డిస్ట్రిక్ట్ కార్పొరేట్ వైస్ చైర్మన్ క్లబ్ అధ్యక్షులు మైలారపు మధుసూదన్, కోశాధికారి రాచకొండ మహేష్, కేశెట్టి సువర్ణ, మైలారపు అక్షయ, బోనగిరి కవిత, కల్పన, రమాదేవి, హేమలత, శోభ, విజయలక్ష్మి, ఇందిరమ్మ, మాధురి, సువర్ణ, సునీత, వాణి, స్వప్న, సమత, సంగీత, మాళవిక, ఉమాదేవి, సాయి ప్రసన్న, లక్ష్మి భావన, పద్మ, సంతోషిని, సాయి కృప తదితరులు పాల్గొన్నారు.