అభివృద్ధిపై చర్చ
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు బాసరలో పర్యటిస్తున్నారు. ఆయనను శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిల కలిసి మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కలను అందజేశారు. బాసర ఐఐఐటీ వసతి గృహంలో జిల్లా అభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై మంత్రి అధికారులతో చర్చించారు. మంత్రి పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.