ఏటీఎంలో చోరీ… దొంగ‌లు ఏం చేశారంటే..?

Theft at SBI ATM:ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో దొంగ‌లు రెచ్చిపోయారు. పట్టణంలోని ఎస్‌బీఐ ఏటీఎంలో (SBI ATM) చోరీ చేశారు. శనివారం తెల్లవారుజామున ఆదిలాబాద్‌ పట్టణంలోని రామ్‌నగర్‌ కాలనీలో ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంలోకి చొరబడిన దొంగ‌లు అనంతరం గ్యాస్‌ కట్టర్‌తో మెషిన్‌ను కట్‌ చేసి డబ్బులు ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. చోరీకి గురైన ఏటీఎంను డీఎస్పీ జీవన్‌ రెడ్డి, సీఐలు స్వామి, సునీల్‌ కుమార్‌ పరిశీలించారు. క్లూస్‌ టీమ్‌ రప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, దొంగ‌త‌నం చేసే ముందు దొంగ‌లు సీసీ కెమెరాలకు బ్లాక్‌ స్ప్రే కొట్టారు. చోరీ అనంత‌రం న‌గ‌దుతో ఉండాయించిన చోరీ గ్యాంగ్ ను ప‌ట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like