మీనాక్షి నటరాజన్ పాదయాత్ర
Meenakshi Natarajan: తెలంగాణ AICC ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ నియోజకవర్గాల పర్యటలను చేయనున్నారు. అయితే, ఆమె ఆయా నియోజకవర్గాల్లో పాదయాత్రల తన పర్యటనలకు శ్రీకారం చుడుతుండటం గమనార్హం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం, పార్టీలో కొత్త, పాత నాయకుల మధ్య సమన్వయాన్ని కల్పించడం, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించే దిశగా పాదయాత్ర సాగనుంది. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం నుంచి ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ పాదయాత్ర కు ఏర్పాట్లు చేస్తున్నారు.
మీనాక్షి నటరాజన్ పాదయాత్రకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ షెడ్యూల్ విడుదల చేసింది. అదే సమయంలో పాదయాత్రకు ఐదుగురు కోఆర్డినేటర్లు నియమించింది. ఆంధోల్, అర్ముర్, ఖానాపూర్, చొప్పదండి, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తారామే. జులై 31న సాయంత్రం 5 గంటలకు పరిగి నుంచి మీనాక్షి నటరాజన్ పాదయాత్ర ప్రారంభం కానుండగా, ఆగస్టు 6న వర్ధనపేటలో పాదయాత్ర ముగుస్తుంది. ప్రతి నియోజకవర్గంలో 8-10 కిలోమీటర్ల దూరం వరకు ఈ పాదయాత్ర కొనసాగనుంది.
మీనాక్షి నటరాజన్ పాదయాత్ర షెడ్యూల్ ఇదే..
జులై 31న పరిగిలో పాదయాత్ర చేయనున్న మీనాక్షి నటరాజన్ రాత్రి అక్కడే బస చేస్తారు. ఆగస్టు 1న ఉదయం శ్రమదానంలో పాల్గొని పార్టీ నేతలతో సమావేశం అవుతారు. అదే రోజు సాయంత్రం ఆంథోల్‌లో పాదయాత్ర చేస్తారు. ఆగస్టు 2న ఉదయం శ్రమదానంలో పాల్గొని పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు. ఆ రోజు ఆర్మూర్‌లో సాయంత్రం 5 గంటలకు పాదయాత్ర చేస్తారు. 3వ తేదీ శ్రమదానంలో పాల్గొని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. 3వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఖానాపూర్‌లో పాదయాత్ర నిర్వహించనున్నారు. 4వ తేదీ ఉదయం శ్రమదానంలో పాల్గొని పార్టీ నేతలతో సమావేశం అవుతారు. అదే రోజు సాయంత్రం చొప్పదండిలో పాదయాత్ర, అక్కడే బస ఉంటుంది. 5వ తేదీ ఉదయం శ్రమదానంలో పాల్గొని పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం అవుతారు. సాయంత్రం వర్థన్నపేటలో పాదయాత్ర చేస్తారు. చివరగా ఆగస్టు 6న శ్రమదానం, కార్యకర్తలు, నాయకులతో సమావేశం నిర్వహించి పాదయాత్ర ముగిస్తారు.