నిజ‌మైన భార‌తీయుడు ఇలా మాట్లాడ‌డు

SC Slams Rahul Gandhi:నిజ‌మైన భార‌తీయుడు ఇలా మాట్లాడ‌డు.. 2 వేల కిలో మీటర్ల భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందా? మీకెలా తెలుసంటూ? కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. భారత భూభాగంపై రాహుల్ చేసిన వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు తీవ్రంగా స్పందించింది. చైనా 2 వేల చదరపు కిలో మీటర్ల భారత భూభాగాన్ని ఆక్రమించిందంటూ ఆయన చేసిన ఆరోపణలను కోర్టు తప్పుబట్టింది. నిజమైన భారతీయుడు ఇలా మాట్లాడడని వ్యాఖ్యానించింది. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఇలాంటి విషయాలు ఎలా చెబుతారని ప్రశ్నించింది. దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన అంశంపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చైనా 2 వేల చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని ఆక్రమించిందంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై అత్యున్నత న్యాయస్థానం స్పందించింది. నిజమైన భారతీయుడు ఇలా మాట్లాడడు అని ఘాటుగా వ్యాఖ్యానించింది. 2022 భారత్ జోడో యాత్ర సందర్భంగా భారత్-చైనా సరిహద్దు వివాదంపై రాహుల్ మాట్లాడుతూ చైనా సైన్యం మన దేశ భూభాగంలోని 2,000 చదరపు కిలో మీటర్ల భూమి ఆక్రమించిందని పలుమార్లు ఆరోపించారు.

అంతేకాకుండా అరుణాచల్ ప్రదేశ్‌లో భారత సైనికులను తొక్కేస్తున్నారంటూ రాహుల్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. అంతేకాకుండా, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రాహుల్ పై పరువు నష్టం కేసు నమోదు చేసింది. ఈ కేసులో అలహాబాద్ హైకోర్టు మే 29న రాహుల్ కి జరిమానా విధించింది. దీంతో ఆయ‌న‌ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు రాజకీయ ప్రేరేపిత‌మ‌ని, కావాలనే తనపై కోపంతో కేసు పెట్టార‌ని రాహుల్ త‌ర‌ఫున లాయ‌ర్లు వాదించారు. న్యాయమూర్తులు దీపాంకర్ దత్తా, అగస్టిన్ జార్జ్ మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం.. ఆయన పిటిషన్‌ను తోసి పుచ్చుతూ వాక్ స్వాత్రంతం సైన్యాన్ని కించపరిచేలా ఉండకూడదని చెప్పింది. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు అయిన మీరు.. ఇలాంటి విషయాలు ప్రజలకు ఎలా చెబుతారని ప్రశ్నించింది. అలాగే పార్లమెంటులో ఈ ప్రశ్నలు ఎందుకు అడగరని కూడా నిల‌దీసింది. దేశ భద్రతకు సంబంధించిన అంశాలపై ఒక రాజకీయ నాయకుడు బాధ్యత లేకుండా మాట్లాడటం సరికాదని సుప్రీం కోర్టు స్పష్టంగా వెల్ల‌డించింది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like