ఎమ్మెల్యేను పరామర్శించిన మంత్రి సీతక్క
Minister Seethakka కాలికి గాయంతో బాధపడుతూ హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావును రాష్ట్ర పంచాయతీరాజ్, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రేమ్‌సాగర్ రావు త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో, ప్రజాసేవలోకి మరింత ఉత్సాహంగా తిరిగి రావాలని కోరుకుంటునట్లు మంత్రి వెల్లడించారు.