యూరియా కోసం అర్థరాత్రి నుంచి పడిగాపులు..
యూరియా కోసం రైతులు రాత్రి,పగలు తేడా లేకుండా పడిగాపులు పడుతున్నారు. యూరియా వస్తుందని తెలిస్తే చాలు… ఎన్ని గంటలైనా వేచి చూస్తున్నారు. కొమరంభీం జిల్లా కాగజ్నగర్ మండలం జంబుగ రైతు వేదిక వద్ద రాత్రి నుండి యూరియా గురించి ఎదురుచూస్తున్నారు. శనివారం ఒక్క లోడ్ వస్తుందని తెలియడంతో రాత్రి నుంచే ఆ కేంద్రం వద్ద క్యూ కట్టారు. కొందరైతే చెప్పులు క్యూలైన్లో పెట్టి మరీ కాసేపు సేదతీరారు. ఎట్టి పరిస్థితుల్లో తమకు యూరియా దొరకబుచ్చుకునేందుకు రైతులు ప్రయత్నాలు చేస్తున్నారు.