జడ్పీటీసీ, ఎంపీపీ రిజర్వేషన్లు ఇవే…

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

Reservations for Local Elections: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాలోని జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలకు రిజర్వేషన్ల కేటాయింపుపై ప్రభుత్వానికి వివరాలు సమర్పించిన‌ట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం క‌లెక్ట‌రేట్‌లోని జిల్లా పరిషత్ ముఖ్యకార్య నిర్వహణ అధికారి గణపతి, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావుతో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, పంచాయతీ శాఖ అధికారులతో రిజర్వేషన్ల కేటాయింపు ప్రక్రియ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా జిల్లాలోని జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ రిజర్వేషన్లకు లాటరీ పద్ధతిన కేటాయించిన‌ట్లు తెలిపారు.

2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, రిజర్వేషన్లు, సాంఘిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల గణన (ఎస్.ఈ.ఈ.ఈ.పి.సి.) ప్రకారం బీసీ రిజర్వేషన్లు కేటాయించిన‌ట్లు వివ‌రించారు. జ‌డ్పీటీసీ కోసం రెండు ఎస్టీ, నాలుగు ఎస్సీ, ఏడు బీసీ, మూడు సాధారణ (జ‌న‌ర‌ల్‌) స్థానాలు కేటాయించిన‌ట్లు క‌లెక్ట‌ర్ తెలిపారు. వీటిల్లో ఏడు స్థానాలు మహిళలకు కేటాయించామ‌న్నారు. ఇక ఎంపీపీ కోసం రెండు ఎస్టీ, నాలుగు ఎస్సీ, ఏడు బీసీ, మూడు సాధారణ (జ‌న‌ర‌ల్‌) స్థానాలు కేటాయించామ‌న్నారు. వీటిలో ఏడు స్థానాలు మహిళలకు కేటాయించామ‌న్నారు. సంబంధిత రిజర్వేషన్ స్థానాల కేటాయింపు వివరాలను ప్రభుత్వానికి నివేదిస్తామ‌న్నారు.

You might also like