బ‌తుక‌మ్మ వేడుక‌ల్లో క‌లెక్ట‌ర్ల ఆటా.. పాట‌..

Collectors’ play.. during Bathukamma celebrations:ప్ర‌తి రోజూ పాల‌నాప‌రంగా ఉరుకులు… ప‌రుగులు… స‌మావేశాలు, ఫైళ్లు… ఇవే లోకం… జిల్లాకు సంబంధించిన విష‌యాల్లో ప్ర‌తి రోజూ స‌మ‌స్య‌.. వాటిని ప‌రిష్క‌రించేందుకు ప్ర‌య‌త్నాలు.. ఇలా జిల్లా క‌లెక్ట‌ర్ అంటే ఎంతో బాధ్య‌త‌… అలాంటి వారు హాయిగా ఆడి పాడారు..

మంచిర్యాల‌, ఆసిఫాబాద్ జిల్లాలో శనివారం బ‌తుక‌మ్మ వేడుక‌లు నిర్వ‌హించారు. ఈ వేడుక‌ల్లో రెండు జిల్లాల‌కు చెందిన క‌లెక్ట‌ర్లు ఇద్ద‌రూ బ‌తుక‌మ్మ ఆడ‌టం విశేషం. మంచిర్యాల జిల్లాలో క‌లెక్ట‌రేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబరాలలో కలెక్టర్ సతీమణి స్వస్తిక, జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి. చంద్రయ్య, కలెక్టరేట్ మ‌హిళా ఉద్యోగులు, స్వయం సహాయక సంఘాల మహిళలతో కలిసి క‌లెక్ట‌ర్ కుమార్ దీప‌క్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా వివిధ శాఖల జిల్లా అధికారులు, మహిళ ఉద్యోగులు, స్వయం సహాయక సంఘాల మహిళలతో కలిసి నృత్యం చేసి అందరిలో ఉత్సాహం నింపారు.

ఇక‌, ఆసిఫాబాద్ జిల్లాలో సైతం క‌లెక్ట‌ర్ వెంక‌టేష్ దోత్రే, అడిష‌న‌ల్ కలెక్ట‌ర్ దిప‌క్ తివారీతో క‌లిసి వేడుక‌ల్లో పాల్గొన్నారు. ఈ ఉత్స‌వాల‌ను ప్రారంభించిన క‌లెక్ట‌ర్ ఉద్యోగుల‌తో క‌లిసి కాసేపు బ‌తుక‌మ్మ ఆడారు. ప్ర‌పంచంలో పూల‌ను పూజించే ఇలాంటి పండ‌గ మ‌రెక్క‌డా లేద‌ని ఆయ‌న కొనియాడారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like