రేషన్ బియ్యం పట్టివేత… ఇద్దరు అరెస్టు
3.2 క్వింటాళ్ల రాయితీ బియ్యం, రెండు స్కూటీలు స్వాధీనం.
ఆదిలాబాద్‌లో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టుకుని ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఆదిలాబాద్ వన్ టౌన్ సిఐ బి సునీల్ కుమార్ వెల్లడించారు. ఆదిలాబాద్ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బొక్కలగూడలో రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారని సమాచారం మేరకు తనిఖీ చేశామన్నారు. షేక్ ఫైజన్, అబ్దుల్ సత్తార్ అనే వ్యక్తులు అక్రమంగా రేషన్ బియ్యం ప్రజల వద్ద కొనుగోలు చేసి తరలిస్తుండగా పట్టుకున్నట్లు వెల్లడించారు.
వారి వద్ద నుంచి 3.2 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేశామన్నారు. వారి వద్ద నుండి రెండు స్కూటీలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ప్రజలు, రేషన్ డీలర్లు అక్రమంగా రేషన్ బియ్యాన్ని దుర్వినియోగం చేసి అధిక ధరలకు అమ్మితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. రేషన్ కార్డు రద్దుకు సైతం సిఫార్సు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎస్సై రమ్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.